లక్కంటే అజిత్ పవార్ దే అని చెప్పుకోవాలి. శివసేన+ఎన్సీపి+కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ సైందవుడి లాగ అడ్డుపడ్డాడు. ఎన్సీపి ఎంఎల్ఏల్లో చీలిక తీసుకొచ్చి బిజెపికి మద్దతు పలికి శరద్ పవార్ తో పాటు శివసేన, కాంగ్రెస్ అధినేతలకు కూడా పెద్ద షాకే ఇచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్ సిఎంగా, అజిత్ పవార్ డిప్యుటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

సరే తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. శరద్ పవార్ ప్రయోగించిన సెంటిమెంటు అస్త్రంతో పాటు వాస్తవాన్ని గ్రహించిన అజిత్ డిప్యుటి సిఎంగా రాజీనామా చేసేశారు. దాంతో వేరేదారి లేకే ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయటం, మళ్ళీ మూడు పార్టీల కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది.

 

డిప్యుటి సిఎంగా రాజీనామా చేసిన అజిత్ వెంటనే మళ్ళీ ఎన్సీపిలోకి వచ్చేశారు. శరద్ పవార్ తో పాటు కీలక నేతలందరితోను చర్చలు జరిపారు. మొత్తానికి అజిత్ కు కొత్త ప్రభుత్వంలో కూడా ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. డిప్యుటి సిఎంగా అజిత్ ను ఎన్సీపి తరపున సీనియర్ నేతలందరూ దాదాపు అంగీకరించారట.

 

ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ఎన్సీపి తరపున జయంత్ పాటిల్ కు ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించాలి. అయితే మారిన పరిణామాల ఫలితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటులో అజిత్ కీలకమయ్యాడు.  దాంతో జయంత్ పాటిల్ స్ధానంలో అజిత్ డిప్యుటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తాజా కబురు.

 

నిజానికి మహారాష్ట్ర రాజకీయాలను బాగా కంపు చేసిందే అజిత్ పవార్. అజిత్ గనుక బిజెపికి మద్దతు ఇవ్వకుండా ఉండుంటే ఈపాటికే మూడు పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుండేది. కావాలంటే ఈ ప్రభుత్వంలోనే డిప్యుటి సిఎం పదవి తీసుకోవటంతో పాటు తనపైన ఉన్న కేసులను కొట్టేసుకునుండచ్చు. మరి ఏం ఆలోచించి ఎన్సీపిని చీల్చి బిజెపికి మద్దతిచ్చాడో ఆయనకే తెలియాలి. సరే ఏదేమైనా అజిత్ మాత్రం బాగా లక్కోన్నడనే తేలిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: