పోర్న్ వాస్తవానికి ఇది విదేశీ సంస్కృతి... కాని భారత్ లాంటి జనాబా ఉన్న దేశాల్లో మంచి వ్యాపారం. పెరుగుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ద్వారా దీనిని అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడి వాటికి బానిసలు గా మారిన యువత మనుషులం అని మర్చిపోయి ప్రవర్తిస్తుంది... ఎంత మందిలో ఉన్నా సరే యువత పోర్న్ వీడియోలు చూడటం, వాటి ద్వారా తమలో ఉన్న మృగాన్ని పెంచి పోషిస్తున్నారు... అద్దు అదుపు లేకుండా రోడ్ల మీద పడుతున్నారు.

 

ఆరేళ్ళ చిన్నారిని అత్యాచారం చేసిన 14 ఏళ్ళ పిల్లాడు... కారణం అతని ఫోన్ లో ఉన్న పోర్న్ వీడియోలు... డబ్బున్న తల్లి తండ్రులు అతగాడికి ఫోన్ కొనివ్వడంతో ఒంటరిగా సమయంలో వీక్షిస్తూ తమలో ఉన్న కోరికలను అదుపు చేసుకోలేక కనపడిన వారి మీద కోరికలు తీర్చుకుంటున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు... ముఖ్యంగా 18 ఏళ్ళు లోపు యువత పోర్న్ కి బానిసలుగా మారి మృగాల మాదిరి ప్రవర్తిస్తున్నారు.

 

ఇక పెద్దాళ్ళు అయితే వృద్దుల మీద కూడా అత్యాచారం చేయడం మనం చూస్తున్నాం. అత్యాచార కేసుల్లో ఉన్న యువతలో 72 శాతం కేసుల్లో పోర్న్ బారిన పడిన వారే ఉన్నారు. కనపడిన వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉంటూ మనుషులం అని మర్చిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడంతో ఇప్పుడు తల్లి తండ్రులు భయపడిపోతున్నారు.

 

తమ ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తుందో రాదో అనే భయం నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి... పోర్న్ వీడియోల బారి నుంచి యువతను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు వాపోతున్నారు. లేకపోతే చిన్న పిల్లలు కోరికలకు బలైపోతున్నారని అంటున్నారు. ఇటీవ‌ల 10 ఏళ్ల లోపు చిన్న పిల్ల‌ల‌పై సైతం మృగాళ్లు అత్యాచారాలు చేస్తుండ‌డం చూస్తున్నాం. ఇక‌పై అయినా ప్ర‌భుత్వాలు వీటి నిషేధానికి క‌ఠిన చ‌ట్టాలు తేవాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: