ఇంగ్లీష్ మీడియం, రాజధాని వివాదం...ప్రస్తుతం ఏపీలో ఈ రెండు విషయాలపై అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇందులో రాజధాని వివాదం పక్కనబెడితే ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్షాలు మామూలుగా రచ్చ చేయడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిని ప్రజలు స్వాగతించిన... ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రం అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కూడా అమలు చేయాలని కోరుతున్నారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో జగన్ ని టార్గెట్ చేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణని రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. తెలుగు భాష అంటే ఎక్కువ మక్కువ చూపే బాలయ్య భాషకు, సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే బాలయ్య అయితేనే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 9నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై బాలయ్యని మాట్లాడించాలని అనుకుంటున్నారు.

 

అయితే తెలుగు భాష, సంస్కృతి పట్ల బాలయ్యకు మక్కు ఎక్కువే. ఈ విషయం ఎవరు కాదనరు. కానీ బాలయ్య మాట్లాడే విధానం ఎవరికి అర్ధం కాదు. ఆయన ఏదైనా స్పీచ్ ఇస్తే ఎటు మొదలుపెట్టి ఎటు ఆపుతారో ఎవరికి తెలియదు. అలాంటి ఆయన చేత అసెంబ్లీలో మాట్లాడిస్తే పిచ్చ కామెడీ అయిపోతుంది. ఇప్పటికే బాలయ్య మాట్లాడే స్పీచ్ లపై సోషల్ మీడియాలో చాలానే కామెడీ వీడియోలు ఉన్నాయి. అలాగే ఆయన రాజకీయ సభల్లో కూడా ఏం మాట్లాడుతారో ఎవరికి అర్ధం కాదు.

 

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అర్ధం కాకుండా మాట్లాడేసి..ఫుల్ కామెడీ అయిపోయారు. ఆయన మాటల వల్ల టీడీపీకి లాభం జరగకపోగా, నష్టమే ఎక్కువ జరుగుతుంది. బాలయ్య హిందూపురం వరకు అంటే ఓకే గానీ... ఓ సీరియస్ పొలిటీషియన్ గా చూడటం మాత్రం కష్టమే. ఇక అలాంటి ఆయన చేత అసెంబ్లీలో తెలుగు మీద మాట్లాడిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు మంచి కామెడీ దొరికినట్లే. కాబట్టి అనవసరంగా అసెంబ్లీలో బాలయ్య చేత మాట్లాడిస్తే నవ్వుల పాలవ్వడం తప్ప పెద్ద ఒరిగేదేమీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: