అమరావతిని సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తాను...ప్రపంచ స్థాయి రాజధాని చేస్తానని చెప్పి చంద్రబాబు రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఐదు సంవత్సరాల్లో పూర్తి గ్రాఫిక్స్ లో ఓ సినిమా చూపించేశారనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మాట. అయితే ఇదే మాటని ప్రజలు కూడా నమ్మారు కాబట్టే ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు.  ఐదేళ్లు మాయమాటలు చెప్పి తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కట్టి ప్రజలకు ఓ మయసభ చూపించారు. అలాగే తమ పార్టీ నేతలకు వేల ఎకరాలు కట్టబెట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ వాధిస్తుంది.

 

అయితే ఇవే మాటలు ఇప్పుడు రాజధాని రైతులు కూడా చెబుతున్నారు. రాజధాని ప్రారంభమయ్యే మొదట్లో చంద్రబాబు ఏదో చేస్తాడని అనుకుని రాజధాని కోసమని చెప్పి రైతులు తమ విలువైన భూములని అప్పగించారు. అలాగే బాబు చెప్పే గ్రాఫిక్స్ మాటలని నమ్మారు. బాబు ఏదో చేసేస్తాడు అని ఆశలు పెట్టుకున్నారు. కానీ అవేం జరగలేదని రైతులకు పూర్తిగా అర్ధమైంది. అందుకే తమలోనే బాధని అణుచుకోలేక  రైతులు ఒక్కసారిగా బయటకొచ్చి బాబుపై ఫైర్ అవుతున్నారు.

 

నవంబర్ 29న అమరావతిలో చంద్రబాబు పర్యటనున్న నేపథ్యంలో రైతులు బాబు తమలని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పి పర్యటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఐదేళ్లు గ్రాఫిక్స్ చేసి తమని మోసం చేశారని, రాజధానికి టీడీపీ వాళ్ళు భూములు ఇవ్వలేదని, పైగా టీడీపీ నేతలు రాజధానిలో 9వేల ఎకరాల వరకు భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. ఇక రాజధాని రైతుల మాటలని బట్టి చూస్తే వాటిల్లో చాలావరకు వాస్తవాలు ఉన్నాయి. రాజధానిలో చాలమంది టీడీపీ నేతలు భూములు కొన్నారు.

 

ఇక అయిదేళ్లలో అమరావతిలో బాబు చేసింది శూన్యం. 33 వేల ఎకరాలు తీసుకుని అక్కడ కట్టిన నిర్మాణాలు తాత్కాలికం మాత్రమే. ప్రతిదీ తాత్కాలిక నిర్మాణం చేపట్టి రైతుల చెవులో పువ్వులు పెట్టారు. ప్రతిసారి తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ఓ పెద్ద గ్రాఫిక్స్ ని చూపించి ఇదే రాజధాని అంటూ ప్రజల్లో భ్రమలు కల్పించారు. ఇక చంద్రబాబు చేసింది భ్రమ అని తెలుసుకుని ఆయన్ని 29న నిలదీసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే బాబుపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని అర్ధమవుతుంది.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: