హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత సంచారం ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. చిరుత ఎటునుండి వచ్చి తమపై దాడి చేస్తుందో అని ప్రయాణికులు పరుగులు తీశారు. చిరుత గురించి సమాచారం అందటంతో ఫారెస్ట్ అధికారులు విసృత తనిఖీలు చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు అది పులి కాదని పిల్లి అని తేల్చటంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ అధికారులు, జూ అధికారులు పిల్లిని బంధించారు. అడవిపిల్లి శంషాబాద్ విమానశ్రయంలోని సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఏరో టవర్స్ దగ్గర ఈ ఘటన జరిగింది. అది చిరుతపులి కాదని పిల్లి అని తేలటంతో ప్రయాణికులు, సిబ్బంది ఆ తరువాత నవ్వుకున్నారు. అడవిపిల్లి చూడటానికి పులి పోలికలతో ఉండటంతో సిబ్బంది, ప్రయాణికులు చిరుతపులిగా భావించారు. 
 
ఫారెస్ట్ అధికారులు, జూ పార్క్ అధికారులు జల్లెడ పట్టి విమానశ్రయాన్ని గాలించారు. ఫారెస్ట్ అధికారులు అడవి పిల్లి, పులి చూడటానికి ఒకే విధంగా ఉంటాయని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం కూకట్ పల్లిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక అడవిపిల్లి ప్రైవేట్ స్కూల్ లోకి వెళ్లటంతో చిరుత అని సిబ్బంది, పిల్లలు కొంత కంగారు పడ్డారు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఈ ఘటన జరిగింది. 
 
అటవీ శాఖ అధికారులు సీసీ టీవీ ఫుటేజీలను కనిపించేది అడవిపిల్లేనని తేల్చారు. తప్పుడు ఫిర్యాదు చేశారని అటవీశాఖ అధికారులు స్కూల్ వాచ్ మెన్ లను అధుపులోకి తీసుకున్నారు. అధికారులు స్కూల్ కు చేరుకొని పులి కాదని పిల్లి అని గుర్తించారు. అదే సీన్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కూడా రిపీట్ అయింది. కానీ కొందరు సిబ్బంది మాత్రం మేము చూసింది చిరుత పులేనని అడవిపిల్లి కాదని గట్టిగా వాదిస్తున్నారు. అడవిపిల్లి హల్చల్ చేయటంతో శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: