రాజ‌కీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండ‌వు. ఎప్పుడు ఎలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రిపై ఎవ‌రు పైచేయి సాధిస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్తితి రాజ‌కీయాల్లో ఎప్పుడూ కామ‌నే. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మ‌ధ్య కూడా ఇలాంటి వైరుధ్య‌మే క‌నిపిస్తోంది. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటై.. కేవలం ఐదు మాసాలే అయింది. అయితే, ఆయ‌న ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కొత్త‌లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విష‌యంలోను, అభివృద్ధి, సాగు నీటికి సంబంధించిన ప్రాజెక్టుల విష‌యంలోనూ ప‌క్క‌రాష్ట్ర సీఎం కేసీఆర్ నుచూసి నేర్చుకోవాల‌ని ప‌దే ప‌దే అటు విప‌క్షాల నుంచి మేధావుల వ‌ర‌కు కూడా అనేక స‌ల‌హాలు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

 

అసెంబ్లీలో మాట తీరు, అధికారుల నియామ‌కం వంటి విష‌యాల్లోనూ కేసీఆర్ ఆద‌ర్శ‌మంటూ.. కొంద‌రు వ్యాఖ్యానించారు. ఈ మాటలు అని ప‌ట్టుమ‌ని నాలుగు మాసాలు కూడా కాలేదు. ఇప్పుడు మొత్తం సీన్ రివ‌ర్స్ అయింది. ఇప్పుడు తెలంగాణ‌లో వినిపిస్తున్న మాట‌.. కేసీఆర్ సార్‌.. మీ ఏపీ సీఎం ఫ్రెండ్ జ‌గ‌న్ ను చూసి నేర్చుకోరాదే! అంటూ వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ పాలనాశైలి. త‌నదైన దూకుడు చూపిస్తూ.. త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు జ‌గ‌న్‌.

 

కేసీఆర్‌కు అత్యంత క‌ష్ట‌సాధ్య మ‌ని చెప్పిన ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌పై ఏపీలో జ‌గ‌న్ ఇప్ప‌టికే సాధ్యం చే శారు. మిగులు బ‌డ్జెట్ అయి ఉండి కూడా.. తెలంగాణ మ‌ద్యం దుకాణాల పెంపును ప్రోత్స‌హించింది. కానీ, త‌గు లు రాష్ట్రం అయిన ఏపీలో మ‌ద్య నిషేధం కార్య‌క్ర‌మం అమ‌లు దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఇక‌, పింఛ‌న్లు తెలంగాణ‌లో కంటే ఎక్కువ‌గానే ఉన్నాయి. అదేస‌మ‌యంలో గ్రామ వలంటీర్ వ్య‌వ‌స్థ ద్వా రా జ‌గ‌న్‌.. రాష్ట్ర నిరుద్యోగాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇలాంటి ప‌రిస్థితి తెలంగా ణ‌లో మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

ఈ నేప‌థ్యంతో పాటు.. ప్ర‌జాస్వామిక నిర‌స‌న‌ల‌కు, ఆందోళ‌న‌ల‌కు కేసీఆర్ అనుమ‌తించ‌ని ప‌రిస్థితి ఉంటే. ఏపీలో ఎలాంటి నిర్బంధ‌మూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే గ‌తంలో జ‌గ‌న్‌ను కేసీఆర్‌తో పోల్చి పాల‌న నేర్చుకోమ‌న్న నోళ్లే.. నేడు జ‌గ‌న్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాల‌ని అంటున్నారు. రాబ‌యే భ‌విష్య‌త్తులో ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: