రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు, నియంత్రించేందుకు జగన్మోహన్ రెడ్డి ఓ  మొదలుపెట్టారు. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటర్ ను జనాలకు పరిచయం చేశారు.  అవినీతి కారణంగా, లంచాల కారణంగా జనాలు ఎదుర్కొంటున్న బాధలు, ఇబ్బందులను పై నెంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని ప్రజలను జగన్ కోరారు.

 

కాల్ సెంటర్ కు  ఒక్క5100 ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిది. సరే ఇబ్బందులున్న వాళ్ళేదో నమ్మకం ఉంటే కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తారు లేకపోతే లేదు. అయితే ఈ కాల్ సెంటర్ విషయంలో తెలుగుదేశంపార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోంది ? అవినీతి నియంత్రణలో జగన్ దంతా కేవలం ప్రచారార్భాటమే అని ఎండగట్టేందుకు నానా అవస్తలు పడుతోంది. కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వర్ల రామయ్య చేసిన ఓవర్ యాక్షనే ఇందుకు నిదర్శనం.

 

 నిజానికి ఐదునెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ అవినీతి నియంత్రణకు చిత్తశుద్దితో పనిచేస్తున్నారనే చెప్పాలి. మంత్రివర్గ సమావేశం జరిగినపుడల్లా ఇదే విషయాన్ని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎంపిలు, ఎంఎల్ఏలు, నేతల సమావేశాల్లో కూడా అవినీతిరహిత ప్రభుత్వం గురించే చెబుతున్నారు. కలెక్టర్లు, ఎస్పీల సమీక్షా సమావేశాల్లో కూడా నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని స్పష్టం చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు జరిగిన బదిలీలు, ప్రమోషన్లలో అవినీతి జరిగిందని, డబ్బులు తీసుకునే బదిలీలు, ప్రమోషన్లు తెచ్చుకున్నట్లు ఎక్కడా వినలేదు.  బదిలీల విషయంలో డబ్బులు తీసుకున్నట్లు  తన దృష్టికి వచ్చిన ఒకటి రెండు ఘటనల విషయంలో జగన్ సీరియస్ గానే స్పందించి వ్యవహారాన్ని  చక్కదిద్దారు. చంద్రబాబునాయుడు పరిపాలనతో పోల్చుకుంటే జగన్ ఐదు నెలల పాలన బాగుందనే చెప్పాలి.

 

పరిపాలనలో జగన్ ఇదే వైఖరితో ముందుకెళితే జగన్ పై  ఆరోపణలు, విమర్శలు చేయటానికి  టిడిపికి ఏమీ సబ్జెక్టు ఏమీ ఉండదు. అందుకనే అవినీతి విషయాల్లో నోటికొచ్చినట్లు జగన్ ను మాట్లాడుతు టిడిపి నేతలు తమ తృప్తి తీర్చుకుంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: