ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో దూకుడుగా వెళ్తున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయడంపై ఇప్పుడు ప్రజల్లో ఆయనపై సానుకూలత పెంచుతుంది అనేది కూడా వాస్తవం. రాజకీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా, ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు.

 

ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. తాజాగా కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్ సర్కార్... ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందించనున్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయించారు.

 

10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి వర్తిస్తుంది. జగనన్న వసతి పథకానికి కూడా ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపైన చదువుకునే విద్యార్థులకు రూ.20వేల వరకు అందిస్తారు. ఇక రైతు భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర వంటి పథకాలను కూడా అన్ని సామాజిక వర్గాలకు అందిస్తుంది ప్రభుత్వం. ఇక రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

 

ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కులాలు చూడకుండా పేదరికం కొలమానంగా చూస్తుంది ప్రభుత్వం. దీనితో అన్ని సామాజిక వర్గాల్లో జగన్ కు మద్దతు పెరుగుతుందని, ఆయనపై ఉన్న అనుమానాలు కూడా తోలగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకరంగా విపక్షానికి దెబ్బే అనేది పరిశీలకుల మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: