తెలుగుదేశం ఎంపీలకు కేంద్రంలో 5 నామినేటెడ్ పదవులు దక్కాయి... అది కూడా కీలక శాఖల్లో పదవులు దక్కాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని ప్రధాని నరేంద్ర మోడీ భుజం తట్టారు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి వెళ్లి జెపి నడ్డాకు శాలువా కప్పారు, బుధవారం వెళ్లి ఆయన్ను నేరుగా కలిసారు, విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీలు హాజరు కాలేదు, రఘురామా కృష్ణం రాజు వెళ్లి బిజెపి పార్లమెంటరి పార్టీ ఆఫీస్ లో కూర్చున్నారు, ప్రధాని మాతృ భాషల గురించి మాట్లాడారు. ఈ పరిణామాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా ఊహించుకోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.

 

రాజకీయంగా బలహీనంగా ఉన్న తమ పార్టీని మళ్ళీ కేంద్రం చేర దీస్తుంది అని చెప్పుకోవడం మొదలుపెట్టింది తెలుగుదేశం క్యాడర్, వాస్తవాలకు దూరంగా ఉండే తెలుగు తమ్ముళ్ళు ఢిల్లీలో జరిగే చిన్న పరిణామాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జగన్ వారంలో ఒక రోజు కోర్ట్ కి వెళ్ళడానికి మినహాయింపు ఇవ్వలేదు కోర్టు అని సంబ‌రాలు చేసుకుంటున్నారు. కానీ వారంలో ఆరు రోజులు బయట ఉంటున్నారు అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు.

 

ఇప్పుడు రాజకీయంగా టీడీపీ బలపడాలి అంటే కేంద్రంలో మద్దతు చాలా అవసరం... ఇప్పుడు కేంద్రంలో జరుగుతున్న చిన్న చిన్న పరిణామాలను ఎక్కువగా ఊహించుకుని అంతా తమకు అనుకూలంగా జరుగుతుందని, జమిలి ఎన్నికలకు చంద్రబాబు అవసరం బిజెపికి ఉంటుందని మాట్లాడటం మొదలుపెట్టారు. అస‌లు ముగ్గురు లోక్‌స‌భ స‌భ్యులు ఉన్న టీడీపీ అస‌వ‌రం బీజేపీకి ఎంత మాత్రం లేదు.

 

అస‌లు మ‌మ‌త‌, దేవ‌గౌడ‌, మాయా లాంటి వాళ్లు కూడా బాబుకు ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ట్లేదు. ఒకపక్క బిజెపి ఒక్కో రాష్ట్రాన్ని దక్కించుకునే పనిలో ఉంటే బాబు గురించి వాళ్ల‌కు ఆలోచించే టైం ఉంటుందా ?  బాబు ఇక్క‌డ పార్టీని బ‌ల‌ప‌ర‌చ‌లేక జాతీయ స్థాయిలో హ‌డావిడి చేసి ల‌బ్ధి పొందాల‌ని చూడ‌డంతో అంతిమంగా పార్టీ నష్టపోతుందని ఆ పార్టీ అభిమానులే అంటున్నారు. ఉట్టికెగ‌ర్లేని అమ్మ స్వ‌ర్గానికి ఎగురుతుంద‌న్న చందంగా బాబు వ్య‌వ‌హారం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: