జాతిపిత మ‌హాత్మా గాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశ‌భ‌క్తుడంటూ కామెంట్ చేసిన బీజేపీ నేత ప్ర‌జ్ఞాసింగ్ థాకూర్ మ‌రోమారు అదే కామెంట్లు చేశారు. లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ...మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడే అని పున‌రుద్ఘాటించారు. జాతిపిత మ‌హాత్మా గాంధీపై గాడ్సే క‌క్ష పెంచుకుని చంపిన‌ట్లు డీఎంకే నేత ఏ రాజా ఎస్పీజీ బిల్లు చ‌ర్చ స‌మ‌యంలో త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. దాన్ని ఎంపీ ప్రజ్ఞా త‌ప్పుప‌డేతై. దేశ‌భ‌క్తుల‌ను ఉదాహ‌ర‌ణ‌గా వాడ‌రాదు అని పేర్కొన్నారు. వివాదాస్ప‌ద బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్ చేఇస‌న ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

 

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ప్రజ్ఞా పెట్టింది పేరు. దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అనేక ప్రసంగాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల వర్షాలు పడడంతో ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భోపాల్ పార్లమెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో అక్కడ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టాలని ఎంపీకి స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. నాయకుల విజ్ఞప్తిపై ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టాయిలెట్లు, మురికి కాలువలు శుభ్రం చేయడానికి తాను పార్లమెంట్‌కు ఎంపిక కాలేదు. మీరు అర్థం చేసుకోవాలి. తాను కేవలం స్థానిక ఎమ్మెల్యేలకు, మున్సిపల్‌ అధికారులకు, కార్మికులకు మాత్రమే ఆదేశాలు జారీ చేస్తాను. వారితో పని చేయించుకోవాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. తాజాగా పార్ల‌మెంటులో బాపూజీ గురించి మాట్లాడుతూ...మ‌ళ్లీ వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు.

 

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీపై ప్రజ్ఞా విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించింద‌న్నారు. 1984లో భూపాల్‌లో జ‌రిగిన యూనియ‌న్ కార్బైడ్ సంస్థ దుర్ఘ‌ట‌న‌ గురించి మాట్లాడుతూ...ఆ సంస్థ చైర్మ‌న్ అండ‌ర్స‌న్‌ను ఆమె ఉగ్ర‌వాదిగా పోల్చుతూ ఓ విదేశీయుడు వ‌చ్చి వేలాది మందిని చంపేశాడంటూ ఆరోపించారు. అత‌ను దేశం విడిచి వెళ్లేలా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని, దీన్నే ఉగ్ర‌వాదం అంటార‌ని ఆమె విశ్లేషించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: