మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతూ ముఖ్యమంత్రి పదవిని అటు బీజేపీ ఇటు శివసేన, ఎన్సీపీ పార్టీలకు ఊరిస్తూ వచ్చి చివరికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ను వరించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి 'మహా' రాజకీయం ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. రోజుకో మలుపు తిరిగిన ఈ రాజకీయంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ అరుదైన రికార్డు ను సృష్టించారు. మహారాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ కాలం పాటు సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 

 

నవంబర్ 23న సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ నవంబర్ 26న తన పదవికి రాజీనామా చేశారు. అంటే కేవలం మూడున్నర రోజుల పాటు మాత్రమే మహారాష్ట్ర కు సీఎం గా వ్యహరించారు. ఇలా అతి తక్కువ కాలం సీఎం గా వ్యవహరించిన వ్యక్తిగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇక ఫడ్నవీస్ కంటే ముందు సావంత్‌ పేరున ఈ రికార్డు ఉంది, ఈయన కేవలం 9 రోజుల పాటు మహారాష్ట్ర సీఎం గా కొనసాగారు. అక్టోబర్ 21, 2019మహారాష్ట్ర లోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. 

 

ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 105 స్థానాల్లో విజయం సాధించింది అధికారం చేపట్టడానికి 145 స్థానాలు అవసరం కాగా మిత్రపక్షం శివసేన తన 56 మంది ఎమ్యెల్యేల మద్దతు ఇవ్వాలంటే రెండున్నర ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవిని తమకు ఇవ్వాల్సిందిగా కోరగా బీజేపీ తిరస్కరించింది. ఇక ఆ తరువాత శివసేన కు  బద్ద విరోధులైన కాంగ్రెస్ మరియు ఎన్సీపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇక శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: