మన చుట్టూ ఉండే చెట్లు ప్రాణవాయువు అయిన ఆక్సిజెన్ ను పగటి పూట అందిస్తాయని, అవే చెట్లు రాత్రి వేళల్లో చెడు గాలిని వదులుతాయని, ఈ గాలిలో హానికరమైన కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉంటుందని మనం 7/8వ తరగతిలో చదువుకున్నాం.  ఈ విషయాలన్నీ చదువుకున్న వారందరికీ తెలుసు ఒక్క పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు తప్ప. అవును మీరు చదివింది కరెక్టే..ఒక ప్రముఖ ఇంగ్లాండ్ స్కూల్ లో చదివి... ఒక దేశానికే ప్రధాన మంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ అడవుల ఆవశ్యత గురించి మాట్లాడుతూ... "గత పది సంవత్సరాలలో.. 70 శాతం పచ్చని చెట్లను నరికివేశారు. గాలిని శుభ్రపరిచే చెట్లను నరికివేసిన మనకు భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. రాత్రి వేళల్లో చెట్లు ఆక్సిజన్ ను అందిస్తాయి. అవి కార్బన్ డై ఆక్సైడ్ ను కూడా పీల్చుకుంటాయి." అన్నాడు.

ఇక ఈ తప్పును ఎత్తి చూపుతూ... పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన 15 సెకనుల వీడియోని... నైలా అనే ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ ట్విట్టర్ లో అప్లోడ్ చేసి 'ఐన్‌స్టీన్ ఖాన్' అనే టైటిల్ పెట్టింది. ఇక ఇది చూసిన నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్నావు... ఈ మాత్రం తెలియదా ప్రధాని గారూ అంటూ ఇమ్రాన్ ఖాన్ ను వేగతాళి చేస్తున్నారు. ఈ పప్పుగాడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలిరో అంటూ కొంతమంది నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం... కొన్ని రకాల ఇంట్లో పెంచుకొనే చెట్లు రోజులో 24 గంటలు ఆక్సిజన్ ను అందిస్తాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో... ఇమ్రాన్ ఖాన్ అన్నీ చెట్లను ఉద్దేశిస్తూ అలా అన్నాడు. అతనికి బొత్తిగా జ్ఞానం లేదు.. ప్రధాని ఎలా అయ్యాడో అని కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: