ఈ మధ్య పట్టణంలో రోడ్ ప్రమాదాలకు లేకుండా పోయంది ఇటీవల జరిగిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రమాదం అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సు ప్రమాదం లో   ప్రైవేట్ ఉద్యోగి మరణం ఇలా చెప్పుకుంటే ఎన్నో.  ఆర్టీసీ ప్రమాదం లో చనిపోయిన మహిళా ఉద్యోగిని టీసీఎస్ కంపెనీ సీనియర్ హెచ్ఆర్ ఆఫీసర్ గా  సాఫ్ట్ వేర్ ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు తన ఆమె భర్త వినీత్‌కుమార్‌ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌ చేస్తున్నారు. ముంబైకి చెందిన వీరు వివాహానంతరం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నా రు. ప్రమాద విషయానికి వస్తే  సోహిని సక్సేనా  కొండాపూర్‌లోని కంపెనీ కి తన సొంత వాహనం స్కూటీ లో బయలుదేరింది ఆ సమయం లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం తో ఆమె హెల్మెంట్ పెట్టుకున్న అక్కడికక్కడే మరణించింది.ఆర్టీసీ బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ శ్రీధర్ బస్సు ని ఆమె కి తగిలించిన విషయం కూడా తెలియక బస్సు ని ముందుకు పోనిచ్చాడు దానితో ఆమె స్కూటీ తో సహా చాలా దూరం దూసుకెళ్లింది.అది చూసిన తోటి ప్రయాణికులు మరియు అక్కడ చుసిన యువకులు డ్రైవర్ ని చితకబాదారు వాణ్ణి నిలదీయగా బస్సు బ్రేకులు పనిచేయలేదని అంతలోనే ఈ ఘటన జరిగిపోయేందని వాపోయాడు. ఈ ఘటన జరిగి చనిపోయిన ఉద్యోగిని పడి ఉండగా ఒక యువకుడు శవం ఫొటోలో వొచ్చేలా సెల్ఫీ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది అది చూసిన ప్రియాణికులు  వాడిని తిట్లతో బుద్దిచెప్పారు కొందరు సెల్ఫీ పిచోళ్లు సిటీలో ఎక్కువయ్యారు అని వాపోయారు. సంఘటన జరిగిన కొద్దిసేపటి తరువాత విషయం తెలిసిన భర్త వినీత్ కుమార్ మరియు వారి  బంధువుల రోదించిన తీరు అందరికి కంటినీరును తెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: