నేర సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల మంది నేరస్థులను తయారు చేసి రాజకీయనాయకుల అండదండలతో చేసిన అఘాయిత్యాలు అన్ని ఇన్ని కావు. ఇతడు చేసిన నేరాలకు ఘోరాలకు ప్రజాప్రతినిధులు సహకారం చేసారు అంటే అతడి సామర్థ్యం ఎంత అని అర్ధం అవుతుంది అతడే గ్యాంగ్ స్టర్ నయీమ్. భువనగిరి సంస్థానగా మొదలు పెట్టిన వీడి అఘాయిత్యాలకు ఎంతో మంది బలిఅయ్యారు. ఇందులో  మాజీ మావోయిస్టులు,  వ్యాపారస్తులు,  కళాకారులూ ఉన్నారు.వీడు ఎక్కడైతే గృహనిర్మాణాలు,  కొత్త వెంచర్ లు స్థాపించిన వ్యాపారస్తులే వీడు  టార్గెట్ గా చేసి వారి దగ్గర దొరికినంత దోచేసేవాడు. అయితే ఇటీవల ఒక పోలీసులు జరిపిన కాల్పులలో ఇతడిని  ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు.   అయితే వీడి మరణానంతరం కొంత మంది పేర్లు కూడా బయటపడ్డాయి.వారి కుటుంబ సభ్యులను సన్నిహితులను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు వారి ఆస్తులను జప్తు చేసారు.వారి ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎన్‌కౌంటర్లో నయీమ్ హతమైన మూడేళ్ల తర్వాత అతడి ఆస్తులపై ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులపై పోలీస్ అధికారులు విచారణ జరిపారు.

దీంతో ఐటీ  అధికారులకు నయీమ్ భార్య  హసీనా చెప్పిన  విషయాన్నీ  రికార్డ్ చేశారు. హసీనా చెప్పిన మాటలు విని ఐటీ  అధికారులు అవాక్కయ్యారు. తాను టైలరింగ్ చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారని నయీమ్ భార్య హసీనా ఆదాయపన్ను అధికారులకు వెల్లడించింది. ఆమె మాటలకూ  అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు అన్నింటినీ హసీనా ముందు ఉంచారు. వీటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: