చంద్రబాబు జాతీయ నాయకుడు. ఎన్నికల ముందు ఆయన చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. బాబు అందరి ప్రతిపక్ష నాయకుల వద్దకు తానే స్వయంగా ప్రత్యేక విమానాలు వేసుకుని తిరిగేశారు. మోడీ దిగిపోవాలి. ముందు ఇదే మా ధ్యేయం. మా ప్రధాని ఎవరో తరువాత కూర్చుని మాట్లాడుకుంటామని బాబు ఢిల్లీ వేదికల మీద పలుమార్లు  మీడియాకుచెప్పారు. ఓ విధంగా విపక్ష కూటమిని తానే నాయకత్వం వహించారు.

 

ఇక గత ఏడాది కర్నాటక ఎపిసోడ్ లో బాబు ఓవరాక్షన్ అందరికీ తెలిసిందే. తమ్ముళ్ళు సైతం మా చంద్రబాబు మోడీ, షాలను ఢీ కొట్టారు. అందుకే అక్కడ బీజేపీ సర్కార్ని ఏర్పాటు చేయలేకపోయింది అని చెప్పారు. చంద్రబాబు సైతం కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీతో పాటు, రాహుల్ గాంధీని కలసి ముచ్చట్లు పెట్టారు. ఓ విధంగా బాబుదే హవా అంతా అన్నట్లుగా అనుకూల మీడియా చేసిన హడావుది అంతా ఇంతా కాదు.

 

అటువంటి బాబు ఇపుడు ముంబై వెళ్తారా, ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో  పాల్గొంటారా  అన్నది ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే పదే పదే శరద్ పవార్ ని ఢిల్లీలో కలసి బాబు జాతీయ రాజకీయాలపైన చర్చలు జరిపి ఎక్కువ రోజులు కూడా  కాలేదు. ఇక శివసేన కూడా ఎన్డీయే నుంచి బయటకు వస్తుందని అప్పట్లో అనుకూల మీడియా పేజీలకు పేజీలు రాసిన కధలూ అందరూ చదివారు, మరి ఇపుడు పవార్ పవరేంటో అంతా చూశారు. బాబు మద్దతు మీడియా చెప్పినట్లుగానే శివసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. మరి బాబు ఎక్కడ.

 

బీజేపీలోని కురువ్రుధ్ధ నాయకుడు ఎల్కే అద్వానీకి, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి ఉద్ధవ్ థాక్రే స్వయంగా అహ్వానాలు అందించి తన ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. అలాగే మమతా బెనర్జీకి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఆహ్వానించారు. మరి ఇంతమందిని పిలిచిన ఉద్ధవ్ థాక్రే బాబుని ఎందుకు పిలవడంలేదు. ఒక వేళ పిలిచినా బాబు రారు అనన్ సమాచరం ఆయనకు ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే సమయంలో బాబు బీజేపీతో కొత్త లింకులు పెట్టుకోబోతున్నట్లుగా నిన్నటి వరకూ ఎన్డీయేలో ఉన్న శివసేనకు తెలిసిపోయిందా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి ముంబైలో ఉద్ధవ్ ప్రమాణానికి మళ్ళీ విపక్షం అంతా హాజ‌రవుతున్నారు. గ్రూప్ ఫోటోలో ఒక్క బాబు తప్ప అంతా ఉంటారు. ఇంతకీ మారింది ఎవరు...?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: