సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఫ్యాన్స్ కి పిచ్చ అభిమానం. అయితే మహేష్ మాత్రం వారిని తగ్గు తగ్గు అంటూ కూల్ గానే ఉంచుతాడు. ఏ విషయంలోనూ ఆర్భాటాలు చేయడు. ఇక పుట్టిన రోజు లాంటివి కూడా ఆయన ఎక్కడో విదేశాల్లో చేసుకుంటాడు తప్ప హడావుడి ఉండదు. ఓ విధంగా మహేష్ ఫ్యాన్స్ మాస్ అయితే మహేష్ పక్కా క్లాస్. అయినా సరే మా మహేష్ అంటూ వారు వెంటపడుతూనే ఉంటారు. ఇపుడు మహేష్ కొద్దిగా మారాడట. దాంతో ఫ్యాన్స్ సంబరం అంబరాన్ని తాకుతోంది.

 

మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరిలో సంక్రాంతి కానుకా\గా వస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఓ వైపు షూటింగ్ శర‌వేగంగా జరుపుకున్నా టీజర్ రిలీజ్ కి మాత్రం చాలా లేట్ అయింది. దాంతో ప్రమోషన్లో అల వైకుంఠపురంలో సినిమా కంటే వెనకబడిపోయామ‌ని ఫ్యాన్స్ ఒక్కటే గగ్గోలు పెట్టారు. మొత్తానికి మొన్న వచ్చిన టీజర్ ఒక్కసారిగా దుమ్ము దులిపేసింది. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

 

ఇదిలా ఉండగా మహేష్ ఫ్యాన్స్ కి ఇపుడు మరో గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇకపై ప్రతి వారం సరిలేరు నీకెవ్వరు మూవీ అప్ డేట్స్ వుంటాయట. వాటిని ఎప్పటికపుడు టీజర్ల రూపంలోనో, మరో దాంట్లోనో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ వారం  రష్మికకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేస్తారట.

 

అదే విధంగా ప్రతీ సోమవారం మహేష్ వారంగా మార్చబోతున్నారుట. జనవరి 11న మూవీ రిలీజ్ అయ్యేవరకూ ఈ ప్రమోషన్ అలా కంటిన్యూ అవుతుందిట.  పోస్టర్లు, పాటలు, వీడియోలు, క్లిప్పిన్స్ వంటివి వరసబెట్టి రిలీజ్ చేస్తారట.  దీంతో సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రమోషన్ సైతం ఎవరికీ సాటి లేని విధంగా అదిరిపోతుందని అంటున్నారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తూంటే నిర్మాత దిల్ రాజ్ అన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: