ప్రభుత్వ సంబంధిత శాఖల్లో  అవినీతి జరిగే శాఖల్లో ముందు ఉండింది రెవిన్యూ శాఖ నే ఏ  చిన్న పని కావాలన్నా మనం వెళ్ళాల్సింది రెవిన్యూ శాఖకే ప్రతి పని కి డబ్బు సమర్పించుకోవాల్సింది ఈ మధ్య నే రెవిన్యూ అధికారులు తమ పని చేయకుండా డబ్బుల కోసం సతాయిస్తున్నారని రెవిన్యూ ఆఫీస్ లకి పెట్రోల్ బాటిల్  పట్టుకెళ్లి బెదిరిస్తున్నారు కానీ ఇక్కడ రివెర్స్ గ జరిగింది.

 

  ఓ ఆఫీసర్  దరఖాస్తు దారుడి మీద చేయి చేసుకున్నారు.కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఎన్నిసార్లు  మీ చుట్టూ తిప్పుకుంటారని అని ప్రశ్నించడమే ఆయన  తప్పు .. లంచం ఇవ్వకపోతే పని జరగదా  అని నిలదీసాడు దాంతో  కంప్యూటర్ ఆపరేటర్ రెచ్చిపోయాడు. దరఖాస్తుదారుడిపై పిడిగుద్దులు గుద్దాడు ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. అక్కడ ఉన్న వారు కల్పించుకుని పక్కకు తీయడంతో గొడవ సర్దుమణిగింది.ఈ  పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.


మద్దాల బాబూరావు అనే వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం కోసం ముసునూరు తహసీల్దార్ కార్యాలయాలో దరఖాస్తు చేసుకున్నాడు . వారం రోజులుగా తిప్పించుకుంటున్నారని బాధపడ్డాడు . ఆవేశంగా లంచం ఇవ్వకపోతే పనులు చేయరా అంటూ నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా కంప్యూటర్ ఆపరేటర్ పవన్, బాబూరావు మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరినొకరు తప్పు పట్టుకున్నారు.

 

ఇంతలోనే సహనం కోల్పోయిన కంప్యూటర్ ఆపరేటర్ పవన్ ఒక్కసారిగా గది లోపల నుంచి పరుగున  బయటకు వచ్చి బాబూరావుపై పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న వారు వద్ద అని చెప్తున్నా  అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాబూరావుకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానంటూ వెళ్తున్న వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది.

 

తనపై దాడిజరిగింది అని బాబూరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ విషయం ఫై  దర్యాప్తు చేపట్టారు. బాబూరావు తనను తిట్టాడని  పవన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే కుల ధ్రువీకరణ పత్రం సకాలంలో ఇవ్వకపోగా దరఖాస్తుదారుడిపై దాడికి పాల్పడడం  ఏంటి అని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్ తీరును పలువురు ఖండిస్తున్నారు.ఇక నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: