మనిషికి ఆధారం భూమి ఇది లేనిదే మానవ మనుగడ లేదు. అలాగే మనసుకి ఆధారం నమ్మకం ఇది లేనిదే  లోకంలో మనిషి ఆనందంగా జీవించలేడు.  ఈ రెండింటికి మద్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఇదే నమ్మకాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి పై కార్మికులు పెట్టుకుని ఇన్నాళ్లూ విధులు నిర్వహించామని చెబుతున్నారు. కాని ఈ మద్యకాలంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెవల్ల జరిగిన పరిణామాలవల్ల కార్మిక కుటుంబాల పరిస్దితి దిక్కులేని పక్షిలా మారింది.

 

 

ఈ సందర్భంగా కార్మికుల మనోగతాలను తెలుసుకుంటే తెలంగాణా ప్రభుత్వం పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా  సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఓ కార్మికుడు రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అదేమంటే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నా.. కానీ, మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా, అసలు తెలంగాణలో ఎందుకు పుట్టాన్రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదన చెందుతున్నా..

 

 

ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో మనస్తాపానికి గురై, తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేనంటూ, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. సూర్యాపేట డిపోకు చెందిన లూనావత్ కృష్ణ.. ఇదే కాకుండా మీరు ఉద్యోగంలో నుంచి తీసేయడం కాదు, నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా.. తక్షణం నా రాజీనామా లేఖను ఆమోదించండి. ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించండి..

 

 

అలాగే మీ బంగారు తెలంగాణాలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని. మీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఇవ్వండి. నా పేరు మీద సెంటు భూమి కూడా లేదు. కాబట్టి 3 ఎకరాల పొలం ఇవ్వండి. నా పిల్లలకు ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పించండి. నాకు ఉండటానికి ఇల్లు లేదు కాబట్టి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఇవన్నీ ఇవ్వకున్నా.. సమాజంలో కనీసం గౌరవంగా బతికే అవకాశం కల్పించండి.. అంటూ తన మానసిన ఆవేదనను వెల్లడించాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: