మహారాష్ట్రలో ప్రస్తుతం పరిణామాలు మహా వికాస్ అఘాడికి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కూటమి ఈరోజు సాయంత్రం అధికారం చేజిక్కించుకోబోతున్నది.  ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  ఉద్ధవ్ థాకరేతో పాటుగా మరికొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.  


మహా వికాస్ అఘాడి కూటమిపై మాజీ సీఎం ఫడణవీస్ భార్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  మూడు విరుద్ధ భావాలు కలిగిన పార్టీలు కలిసి సంకీర్ణంగా ఏర్పడ్డాయి.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.  ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హాస్యాస్పదం.  కలలో కూడా ఊహించలేదు.  శివసేన అవకాశాన్ని వినియోగించుకుంది.  కానీ, కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో చిక్కుకున్న శివసేన ఎంతో కాలం అక్కడ మనుగడ సాగించలేదని, త్వరలోనే తెలుసుకుంటుంది అన్నారు.  
కాంగ్రెస్ తో కలిసి ఉండటం అంటే పేచీలతో కాపురం చేయడమే అని అన్నారు.  అతి త్వరలోనే తిరిగి మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉన్నట్టుగా ఆమె చెప్పారు.  మహారాష్ట్రలో బీజేపీపై పెద్దగా వ్యతిరేకత లేదు.  అలానే ఫడ్నవీస్ క్లీన్ ఇమేజ్ ఉన్నది.  కానీ, పరిస్థితులు కారణంగా బీజేపీకి కొన్ని సీట్లు తక్కువగా వచ్చాయి. శివసేనతో కలిసి పోటీ చేయడం వలన తక్కువ సీట్లు వచ్చాయి.  


కలిసి ఉంటె బాగుండేది.  కానీ, శివసేన అత్యాశకు పోయింది.  ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని అనుకుంది.  కానీ, ముఖ్యమంత్రి పీఠం మూన్నాళ్ళ ముచ్చటే అని తెలుసుకోలేకపోతున్నట్టు ఆమె తెలిపారు.  కర్ణాటకలో జేడీఎస్ ముఖ్యమంత్రిని ఎలాగైతే పార్టీ ఏడిపించిందో అలానే శివసేనను కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఏడిపిస్తుందని త్వరలోనే శివసేన తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉన్నది బీజేపీ. కాగా, శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్ పార్టీకి 13 మంత్రిపదవులు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీకి అలానే స్పీకర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: