ఇప్పుడు ఎన్ని అనుకుంటేనేం పదవి పోయింది.. ప్రభుత్వం కూలిపోయింది.  అజిత్ పవార్ వచ్చి కలవడం ఆ వెంటనే మహాలో బీజేపీ సర్కార్ ఏర్పాటు కావడంతో మొత్తం మారిపోతుంది అనుకున్నారు.  కానీ, అజిత్ పవార్ తన వెంట 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పినా ఫలితం లేకపోయింది.  అందరూ శరద్ పవార్ వెనకాలే ఉన్నారు తప్పించి అజిత్ వెంట ఒక్కరు కూడా లేరు.  దీంతో అజిత్ పవార్ మరలా రాజీనామా చేసి వచ్చిన దారినే వెనక్కి వెళ్లడంతో ఫలితాలు తారుమారయ్యాయి.  
వచ్చిన అవకాశం చేజారిపోయింది.  అజిత్ పవార్ వెనక్కి వెళ్లడంతో తిరిగి అయన ఎన్సీపీలో చేరారు.  మరలా ఆయనకు మహా వికాస్ అఘాడిలో  ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ఉన్నది.  ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉంటుంది అన్నది డౌట్.  ఈ డౌట్ ను పక్కన పెడితే, అజిత్ పవార్ తో కలవడం పెద్ద తప్పు. ఈ సంగతి తెలిసిందే.  
కానీ, కలిశారు.  సుప్రీం కోర్టు చెప్పిట్టుగా నిన్నటిలోగా ప్రభుత్వం ఏదోలా అధికారం నిలబెట్టుకుంటే పోయేది.  అది జరగలేదు.  తొందరపడటం వలన అజిత్ కు లాభమే జరిగింది.  బీజేపీ పరువు పోగొట్టుకుంది.  దీనిపై బీజేపీ సీనియర్ నేత ఏకనాథ్ ఖడ్సే కొన్ని వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ ఎన్నికల సమయంలో తమను ప్రచారానికి దూరంగా ఉంచిందని అందుకే బీజేపీకి 20 సీట్లు తక్కువగా వచ్చాయని అన్నారు.  అదే తాము ప్రచారం చేసి ఉంటె మరోలా ఉండేదని అన్నారు.  
ఏకనాథ్ ఖడ్సే గతంలో బీజేపీ అధికారంలో ఉండగా రెవిన్యూశాఖ మంత్రిగా పనిచేశారు.  ఆ సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రిగా 2016 తొలగించారు.  అయితే, పార్టీలో సీనియర్ నేతగా ఉన్నా కూడా ఎన్నికల సమయంలో ఆయన్ను దూరంగా పెట్టడంతో కొన్ని సీట్లు కోల్పోయారని కూడా చెప్పొచ్చు.  అవినీతిపై బీజేపీ సర్కార్ ఎప్పుడు దూరంగా ఉంటుంది.  మహారాష్ట్ర విషయంలో అధికారం చేజిక్కించుకునే విషయంలో ఫెయిల్ అయ్యింది.  అవకాశం కోసం బీజేపీ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: