మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  కమలనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  అయితే, అయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా పరిణామాలు జరిగాయి.  రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు.  రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి.  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  కమల్నాథ్, మాధవ్ రావు సింధియాల మధ్య వార్ జరుగుతుంది. ఈ వార్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు.  అయితే, సింధియాకు సపోర్ట్ గా నిలుస్తున్న 25 మంది ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో ఉండటం లేదట.  దీంతో అక్కడ కమల్నాథ్ సర్కార్ ఇబ్బందుల్లో పడింది.  
కమల్నాథ్ పనితీరుపై సింధియా అసంతృప్తితో ఉన్నారని, అందుకే అయన వర్గం ముఖం చాటేసిందని అంటున్నారు.  ముఖం చాటేయడంతో మధ్యప్రదేశ్ సర్కార్ ఇరకాటంలో పడిందని, వీరంతా తిరుగుబాటు చేయడం ఖాయం అని చెప్తున్నారు.  కానీ, సింధియా వెర్షన్ మాత్రం మరోలా ఉన్నది.  ఎవరూ ఎక్కడికి వెళ్లలేదని, అందరూ ఉన్నారని, కమలనాధ్ తో విభేదం ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తామని అంటున్నారు.  
ఒకవేళ సింధియా గ్రూప్ కు చెందిన ఎమ్మెల్యేలు బయటకు వస్తే.. ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది.  కమల్నాథ్ రాజీనామా చేయాల్సి వస్తుంది.  ఇదే జరిగితే మధ్యప్రదేశ్ లో కమలం మళ్ళీ వికసించడం ఖాయం అవుతుంది.  మధ్యప్రదేశ్ లో 2018 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో విజయం సాధించింది.  అధికారం చేపట్టడానికి కావాల్సిన మరో రెండు సీట్లకోసం ఎస్పీ, బీఎస్పీ, ఇండిపెండెంట్లు సపోర్ట్ చేశారు.  
అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే కమల్నాథ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది.  ఇది ఇలానే కొనసాగితే మరో నాలుగైదు నెలల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అలానే చేస్తుండటం విశేషం.  ఇది వాళ్లకు కొత్తేమి కాదు. అయితే, మధ్యప్రదేశ్ లో సంవత్సరం సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఆ పార్టీ ఎలా ప్రవర్తిస్తుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: