టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరియర్ పై కొన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. మీడియాలో కొత్త రూమర్స్  పుట్టుకొస్తూనే వున్నాయి . ప్రపంచకప్ కు  ముందు నుంచి ధోనీ ప్రదర్శన  అంతగా ఆకట్టుకోవడం లేదు.  అయినప్పటికీ ధోని  మీద నమ్మకం ఉంచి  ప్రపంచకప్ లో  అవకాశం కల్పించారు సెలెక్టర్లు. అయినప్పటికీ ప్రపంచ కప్ లో కూడా ధోనీ తన ఆటతో అభిమానుల్లో ఆగ్రహం తెప్పించాడు . ఓడిపోయే మ్యాచ్ లను  సైతం తన తన అద్భుత ఆటతో  తో విజయతీరాలకు చేర్చిన ధోని... మొన్నటి ప్రపంచకప్లో మాత్రం గెలిచే మ్యాచ్ లను  కూడా తన పేలవ ప్రదర్శనతో  ఓడిపోయేలా చేశారు. 

 

 

 

 ఇక ప్రపంచ కప్ తర్వాత ధోనీ అసలు మైదానంలో అడుగు పెట్టలేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సిరీస్ లకు ధోని దూరంగానే ఉన్నారు. ధోని కెరియర్ ముగిసిపోయిందని ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని  సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి...చేస్తూనే ఉన్నాయి.  మిగతా క్రికెటర్లు అందరూ ధోని  రిటైర్మెంట్ పై  వస్తున్న వార్తలపై  స్పందించారు కానీ ఇప్పటివరకు ధోనీ మాత్రం స్పందించలేదు.దీంతో  నిజంగానే ధోనీ తన రిటైర్మెంట్ ఆలోచన లో ఉన్నాడా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాగా అటు మిగతా క్రికెటర్ లందరికీ మీడియా సమావేశాల్లో  పదేపదే అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఎట్టకేలకు దీనిపై మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. వచ్చే ఏడాది జనవరి వరకు నన్ను ఏమి  అడగొద్దు అంటూ అందరి నోళ్ళు మూయించే చేసాడు మిస్టర్ కూల్  ధోని. 

 

 

 

 బుధవారం ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న మహేంద్రసింగ్ ధోని మీడియాతో మాట్లాడారు... అయితే జనవరి నెల వరకూ తననేమీ అడుగొద్దంటూ  సమాధానం చెప్పిన ధోని... జనవరి తర్వాత తన క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జనవరి తర్వాత ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగు పెడతాడా లేక అక్కడితో తన కెరియర్ ముగింపు  చేసి రిటైర్మెంట్ ప్రకటిస్తాడ అన్నది కూడా అప్పుడే తేలిపోనుంది. ధోని కెరియర్ కి సంబంధించిన సస్పెన్స్ కు  తెర పడాలి అంటే జనవరి వరకు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: