ఒక ఉద్యమం ఊపిరిపోసుకుంటే దాని దానివల్ల నష్టం జరిగిన ఆ కష్టం మాత్రం ఫలిస్తుంది. కాని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెవల్ల ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ ఉనికిని కోల్పోవలసిన దుస్దితి ఏర్పడింది. ఎవరు ఆడిన చదరంగమో తెలియదు గాని, బ్రతుకులు బాగుపడతాయని తెచ్చుకున్న తెలంగాణాలో జరుగుతున్న దుష్ట రాజకీయాల వల్ల ప్రజలు భరించలేని భారాన్ని మోస్తున్నారు. గొర్రెలు ఎప్పుడు కసాయి వాడినే నమ్ముతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజల జీవితాలు అంతేలా ఉన్నాయంటున్నారు ముందుచూపుగా ఆలోచిస్తున్న విద్యావంతులు.

 

 

ఇకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి ఎంత జరిగింది అని తెలియాలంటే ఇక ఎక్కువ రోజులు ఆగవలసిన అవసరం లేదు ఇప్పటికే కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న పరిస్దితులను అంచనా వేయవచ్చూ. సమస్త ప్రజానీకం కలలుకన్న బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణలా మారి మోయలేని భారాన్ని మోస్తుంది. ఒక రకంగా ప్రజలకు ఈ శాస్త్రి జరగవలసిందే అని అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబీకులు.

 

 

ఇకపోతే ఇప్పుడు ఆర్టీసీని నడపాలంటే పెద్దమొత్తంలో నిధులు కావలసి ఉంది. ఇందుకు గాను ఆర్టీసీ అధీనంలో పెద్ద మొత్తంలో ఖాళీగా ఉన్న భూముల పై కన్నేసిన ప్రభుత్వం వాటిని సేకరించే పనిని పూర్తి చేసింది.. వాటిని అమ్మితేగానీ వీఆర్‌ఎస్‌ అమలుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వానికి సమకూరవు అని చిలక పలుకులు పలుకుతుంది.. ఇక ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు పూర్తి వివరాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే గురువారం జరిగే కేబినెట్‌ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

 

ఇక టికెట్ల ధరలను ఏటా పెంచేలా ఓ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుపైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు కార్మికులను ఒకవేళ విధుల్లోకి చేర్చుకుంటే భవిష్యత్తులో సమ్మెలు, యూనియన్‌ సభ్యత్వం లేకుండా పకడ్బందీ షరతులు విధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహరాన్ని ఈ భేటీలో తేలుస్తారా లేదా సమగ్ర నివేదిక అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.

 

 

అధికారులు మాత్రం ఆర్టీసీకి సంబంధించి.. కార్మికులు, వారి వయసులు, అప్పులు, ఆస్తులు, డిపోలు, వాటి పరిధిలో బస్సులు, వాటి కండిషన్, వేరే రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి, ఒక్కో బస్సు ఖరీదు వంటి వివరాలతో సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేశారు. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల కనబడకుండానే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్న విషయాన్ని అర్ధం చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: