ఏదో సాధించి పెడతామని ఆర్టీసీ కార్మికులను నమ్మించి  సమ్మె మొదలుపెట్టిన ఆర్టీసీ జేఏసీ కాస్త ఏమీ సాధించలేక ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లో చేరిపోండి  అంటూ నట్టేట ముంచింది . దీంతో ఆర్టీసీ కార్మికులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సమ్మె జరుగుతున్న సమయంలో విధుల్లో  చేరాలని కేసీఆర్ హెచ్చరించినప్పటికీ కార్మికులు ఆర్టీసీ జేఏసీ నేతల మీద నమ్మకంతో వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ నేతలె  విధుల్లో చేరాలని సమ్మె విరమించటంతో  ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటు తేల్చుకోలేని  పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు. ఉద్యోగాలు ఉంటాయా  అన్నది కూడా  ప్రశ్నార్ధకంగా మారింది. 

 

 

 

 ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించినప్పటికే ఆర్టీసీ సమ్మె సమయంలో  ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని... ఆర్టీసీ సంస్థను  నడిపించాలంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు అంతేకాకుండా ఇప్పటికే 5100 రూట్లను ప్రవేట్ పరం  చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈరోజు రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముందు నుంచి కేసీఆర్ చెబుతున్నట్టుగా సగం ఆర్టీసీ రూట్లను  ప్రైవేట్ పరం చేస్తే... ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటో అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 

 

 

 

 ఆర్టీసీలో దాదాపు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఒకవేళ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే ఆర్టీసీలో పనిచేసేందుకు ప్రభుత్వానికి అవసరమైనది  24 వేల మంది కార్మికులు మాత్రమే. ఇక మిగతా కార్మికుల సంగతి ఏంటంటే... వారందరికీ వాలంటరీ రిటైర్మెంట్ లేదా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేసేందుకు సర్కారు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ లో 50 ఏళ్లు పైబడిన ఆర్టీసీ కార్మికులు 20 వేలకు పైగానే ఉన్నట్లు సర్కార్ అంచనా వేస్తోంది. వీరందరికీ విఆర్ఎస్ ఆఫర్ ఇచ్చి ఇంటికి పంపించాలని... ఒకవేళ తిరస్కరిస్తే ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక కంపల్సరీ రిటైర్మెంట్ ను కూడా అమలు  అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ సమావేశం తర్వాత ఆర్టీసీ పై  ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: