2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో... సోషల్ మీడియా కూడా ఒకటి... వాస్తవాలకు దూరంగా పార్టీ క్యాడర్ ని ఉంచింది సోషల్ మీడియానే అనేది నూటికి నూరుపాళ్ళు నిజం. పార్టీ బలంగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలను, లోకేష్ మంత్రిగా సాధించిన విజయాలను ఎక్కువగా ప్రచారం చేసుకుంది సోషల్ మీడియా. ఇక ఢిల్లీలో విపక్షాలు ఏకం అవ్వడం చూసి బిజెపి ఓడిపోతుంది బాబు ప్రధాని అవుతారు, అరవింద్ కేజ్రివాల్ ఉప ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు.

 

రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉందనే విషయాన్ని ఎక్కడా  సోషల్ మీడియా గాని నాయకులు గాని గ్రహించలేదు అనేది వాస్తవం. సోషల్ మీడియాలో వస్తున్న లైకులు చూసి అంతా బాగుంది అనుకున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది... సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉంది... క్యాడర్ ఎక్కువ కాబట్టి పార్టీకి వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మంది సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు...

 

రాజకీయంగా పార్టీ బలాన్ని పెంచుకోకుండా చంద్రబాబు సోషల్ మీడియా నివేదికల మీద ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో పరిస్థితిని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. కార్యకర్తల మీద దాడులు, ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వంటి వాటిని చూసి చంద్రబాబు ఎక్కువగా విశ్లేషణలు కూడా చేస్తున్నారని కొందరు అంటున్నారు. జాతీయ రాజకీయ పరిణామాలపై క్యాడర్ ఏం అనుకుంటుంది అనేది కూడా చంద్రబాబు సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి నమ్ముతున్నారని అంటున్నారు.

 

ఇప్పుడు ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారిందని... ఈ వైఖరి మారాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పుడు బలం మీద దృష్టి పెట్టాలి గాని సోషల్ మీడియా మీద కాదు అంటున్నారు. చంద్ర‌బాబు వైఖ‌రే కాదు ఈ విష‌యంలో చిన‌బాబు సైతం సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పోస్టులు... త‌మ పార్టీ లేదా త‌మ‌కు అనుకూలంగా వ‌చ్చిన పోస్టులు చూసుకునే సంబ‌ర ప‌డిపోతుంటాడ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లోనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: