ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఉల్లి ఘాటు గట్టిగా తగులుతుంది అనేది వాస్తవం... మహారాష్ట్రలో నాలుగు నెలలుగా పడుతున్న వర్షాల దెబ్బకు... హైదరాబాద్ మార్కెట్ కు ఉల్లి సరఫరా ఆగిపోయింది. హైదరాబాద్ మార్కెట్ కి వచ్చే ఉల్లిలో మహారాష్ట్ర నుంచి 80 శాతం వస్తుంది. వర్షాలతో అక్కడ పంటలు నాశనం కావడంతో రోజు 150 నుంచి 200 లారీలు వచ్చే ఉల్లి... ఉన్నపళంగా 30 లారీలకు పడిపోయింది. దీనితో బహిరంగ మార్కెట్ లో క్వింటాల్ కు 100 వరకు పలుకుతుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  

 

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉల్లి కొరత తీవ్రంగా ఉండటంతో ఇక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు తక్కువ ధరకు ఉల్లిని అందిస్తూ వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి కేజీ ఉల్లిని కేవలం రూ.25కు మాత్రమే అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితమే ఉల్లికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే జగన్ దీనిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణా విషయానికి వచ్చి చూద్దాం... తెలంగాణాలో కూడా ఉల్లి కొరత తీవ్రంగా ఉన్నా సరే...  

 

తెలంగాణా ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. ఆలస్యంగా మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ధరలను తగ్గించి వంద రూపాయలు మార్కెట్ లో 40 రూపాయలకు అంటే ఆంధ్రప్రదేశ్ కంటే 15 రూపాయలు ఎక్కువకు అందిస్తూ నిర్ణయం తీసుకుంది. అది కూడా కుటుంబానికి అర కేజీ మాత్రమే. ధనిక రాష్ట్రం, హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్న నగరం 15 రూపాయల దగ్గర ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఎవరికి అర్ధం కాని పరిస్థితి. ఏది ఎలా ఉన్నా డబ్బులు లేకపోయినా జగన్ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రజలను ఆకట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: