దేశంలో అక్రమ సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పచ్చని కాపురం మధ్య అక్రమ సంబంధం అనే పెనుభూతం వచ్చి అభం శుభం తెలియని పిల్లలను అన్యాయం చేస్తోంది. ప్రతిరోజు వివాహేతర సంబంధాల వలన ఎన్నో ఘోరాలు జరిగి వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం చెప్పుకునే సంఘటన నెల్లూరు జిల్లాలోని వైయస్సార్ నగర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సలీం, పర్వీన్ కు వివాహమై 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్ల వివాహ బంధంలో ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సలీం మెకానిక్ గా పనిచేస్తూ ఉండేవాడు.. పర్వీన్ మాత్రం ఇంట్లో ఉండి తన పిల్లలను చూసుకుంటూ..ఇంకా వంట పనులు చేస్తూ ఉండేది. ఇంట్లో పని పూర్తిచేసిన తర్వాత.. పర్వీన్ వాట్సాప్ ను ఎక్కువగా యూజ్ చేసేది.. కొంతమంది మహిళలతో కూడా బాగా చాటింగ్ చేసేది. అయితే ఈ క్రమంలోనే షేక్ షుకూర్ అనే ఒక ఆటో డ్రైవర్... పర్వీన్ తో వాట్సాప్ లో టచ్ ఉన్న... ఒక మహిళ ద్వారా.. పర్వీన్ నెంబర్ను స్వీకరించాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా పర్వీన్ కు వాట్స్అప్ మెసేజ్లు పంపించడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత పర్వీన్, షేక్ షుకూర్ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం క్రమక్రమంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది.

భర్త లేని సమయంలో పర్వీన్ తరచుగా షేక్ షుకూర్ ను కలసి శృంగారంలో పాల్గొనేది. అయితే వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీ ఫోటోలను కూడా దిగారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుండడంతో... పర్వీన్ వైకిరిలో బాగా మార్పు వచ్చింది. ఇది గమనించిన పర్వీన్ భర్త సలీం... 'ఓహో ఏదో కథ ఉంది అనుకుంటూ.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు....దాంతో ఆమె ఫోనులో ఉన్న వాట్సాప్ చాటింగులను పరిశీలించాడు. తర్వాత పర్వీన్ మొబైల్ లో ఉన్న ఫోటోలు మొత్తం చెక్ చేయడం ప్రారంభించాడు.. ఆ సమయంలో షేక్ షుకూర్ తన భార్య పర్వీన్ ను ముద్దుపెట్టుకుంటున్న పిక్ కనిపించింది. దాంతో షాకయిన సలీం.. 'హమ్మనియమ్మ, ఇది నా వెనుక ఇంత పెద్ద కథ నడిపిస్తున్నదా?' అనుకున్నాడు.

ఇక ఈ చిన్న క్లూ దొరికిన సలీం..తన భార్య పర్వీన్ కదలికలపై నిఘా పెట్టాడు. అయితే ఇదంతా తెలియని ప్రియుడు షేక్ షుకూర్ ఒకరోజు.. పర్వీన్ ని కలసి ఆమెతో ఎప్పటిలాగానే రాసలీలలు కొనసాగించడం ప్రారంభించాడు. దాంతో వీరిద్దరూ కలిశారన్న విషయాన్ని నిర్ధారించుకుని... స్నేహితులు, కుటుంబ సభ్యులతో సహా సలీం రెడ్ హ్యాండెడ్ గా ఈ జంట గుట్టును రట్టు చేశాడు. అయితే దొరికిన ఆటోడ్రైవర్ షేక్ షుకూర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సలీమ్ స్నేహితులు అతన్ని పట్టుకుని చితకబాదారు. వివాహం అయ్యి ఇద్దరు పిల్లల్ని కన్నా కూడా... ఇలా పక్కదారి పట్టడంతో పర్వీన్ ను కూడా నాలుగు దెబ్బలు కొట్టారు సలీం కుటుంబ సభ్యులు.

ప్రియుడు షేక్ షుకూర్ ను పోలీసులకు అప్పగించారు. షేక్ షుకూర్ కూడా పోలీసుల కాళ్ళ వెళ్ళా పడి 'నేను తప్పు చేసానయ్యా' అంటూ ఒప్పుకున్నాడు. పర్వీన్ కి సంబంధించిన ఫోటోలను షుకూర్ ఫోన్ నుంచి డిలీట్ చేసే క్రమంలో పోలీసులకు వేరే ఆడవాళ్ళ ఫొటోస్ కూడా కనిపించాయి. దాంతో అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: