మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరావతిలో భారీ ఎత్తున రైతులు రాజధాని పేరుతో భూములను దోచుకున్న చంద్రబాబు నాయుడు పర్యటించవద్దంటూ నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున రైతుల నుండి భూములను సేకరించి భూములకు ఫ్లాట్లు కూడా ఇవ్వకపోవడం వలన తాము రోడ్డున పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మా బతుకులు చంద్రబాబు వలన బుగ్గిపాలయ్యాయంటూ రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు పర్యటించవద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై దాడులు చేశాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు రైతులు రాళ్లతో దాడి చేశారు. 
 
రైతులు నల్ల జెండాలతో ఆందోళన తెలిపారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద కొంత సమయం పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉండవల్లిలోని తన నివాసం నుండి చంద్రబాబు పర్యటనను ప్రారంభించారు. రైతులు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ వర్గీయులు, రాజధాని రైతులు చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. 
 
రైతులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఫ్లెక్సీల ద్వారా చంద్రబాబు నాయుడుకు ప్రశ్నలు సంధించారు. రైతులను చంద్రబాబు రాజధాని పేరుతో మోసం చేశారని మోసం చేసిన చంద్రబాబు మళ్లీ అమరావతిలో ఎలా పర్యటిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొద్దిసేపు తోపులాట జరిగింది. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటనతో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా కూల్చివేసిన ప్రజావేదికను పరిశీలించారు. బలహీనవర్గాల కోసం నిర్మించిన గృహ నిర్మాణాలను చంద్రబాబు సందర్శించబోతున్నారు. రైతులతో ప్రత్యేకంగా సమావేశం కావలని చంద్రబాబు భావించినా అమరావతిలో నెలకొన్న పరిస్థితులను బట్టి సమావేశం జరగటం కష్టమే అని చెప్పవచ్చు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: