రాంగోపాల్ వర్మ అంటేనే  సంచలనాలకు మరియు వివాదాలకు  చిరునామా.ఎదో విదంగా  తరచూ పబ్లిసిటీ కోసమో లేక అతడి ఇష్టానుసారమో తెలియదు కానీ ఇతడు చేసే ప్రతి పని , ప్రతి  సినిమా  వార్తల్లో నిలుస్తుండడం మాత్రం చూస్తూ ఉంటాం. మొన్న ఎన్నికల సమయం లో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎప్పుడు కమ్మ రాజ్యం లో కడప రెడ్లు చిత్రం. ఈ రెండు చిత్రాలు ఆంధ్ర రాష్ట్రము లో ఒక పెద్ద రాజకీయ దుమారమే లేపుతుంది. చిత్ర పేరుని ప్రకటించినప్పటి నుండి సంచలనాలకు చర్చలకు వేదికైంది ఎప్పుడు రోజుకొక ట్రైలర్ విడుదల చేస్తూ ఒక్కొక్క నాయకుడి  పైన అది ప్రభావం చూపడం ఇదంతా ఈ బడా డైరెక్టర్ కి ఎందుకురా బాబో... అని అనిపించక మానదు. ఒకప్పుడు  దయ్యాల సినిమాలు తరువాత సెక్స్ తరహా సినిమాలు అలాగే ఫ్యాక్షన్ తరహా సినిమాలు తీసిన ఈయన  కొద్దిరోజులుగా  ప్రస్తుత రాజకీయలకు సంబందించిన  వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ట్రైలర్ ని  అలాగే చిత్ర పేరుని ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూ రూపం లో సినిమా కథ మరియు సన్నివేశాల గురించి వివరిస్తూ హల్చల్ చేస్తున్నారు.   కొద్దిరోజులుగా ఆయన రాజకీయాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కు సంబందించిన విషయాలను టీవీ లలో ప్రేక్షకులతో మరియు మీడియాతో పంచుకోవడం కొసమెరుపు.  
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమా చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు కానీ సడెన్ గా ఆ సినిమాలోని పాటను విడుదల చేయడం అప్పట్లో సంచలనము రేపింది. అలాగే అతడు ప్రకటించిన తొమ్మిదో తారీకు తొమ్మిది గంటలకు ట్రైలర్ విడుదల చేస్తానని చంద్రబాబు మీద ఒట్టు అని ప్రకటించడం సంచలనానికి దారితీసింది. రాంగోపాల్ వర్మ ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల గురించి వైస్సార్ కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీల మధ్య కొనసాగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కథ సన్నివేశాలు ఉంటాయని ఎందులో ఎన్టీఆర్ కి సంబందించిన విషయాలు కూడా చూడవచ్చని వెల్లడించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: