బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేశారు మహాత్మ జ్యోతిరావు పూలే. అంటరానితనం, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం లాంటి వాటిపై ఎంతో పోరాటం చేశారు. కాగా నేడు మహాత్మ జ్యోతిరావు పూలే 129వ జయంతి జరుపుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం చేసిన అలుపెరుగని పోరాటాన్ని నెమరువేసుకుంటున్నారు . అయితే మహాత్మ జ్యోతిరావు పూలే 129 వర్ధంతి ఈ సందర్భంగా విజయవాడలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే విధానాలనే తమ ప్రభుత్వం హయాంలో  అమలు చేస్తున్నామంటూ తెలిపారు. 

 

 

 

 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఐదు మందికి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టాము  అంటూ జగన్ తెలిపారు. ఇక మార్కెట్ యార్డ్ లో కూడా ఎన్నో చైర్మన్ పదవులను అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చామని... తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేసే వారని.... కానీ తమ ప్రభుత్వ హయాంలో మాత్రం వారి హక్కులకు  న్యాయం  చేస్తున్నట్టు తెలిపారు. 

 

 

 

 బడుగు బలహీన అనగారిన వర్గాలకు  చేయూతనిస్తూ ప్రతి తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపి చదివించేందుకు అమ్మఒడి  పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మీ పిల్లల్ని మీరు బడికి పంపండి మీ వెంట మేముంటామంటూ హామీ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం  ప్రవేశపెట్టి బడుగు బలహీనవర్గాల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉద్దేశంతోనే నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే విధానాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: