తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు బయల్దేరాడు. అయితే ఆలా బయల్దేరిన చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. ఆ అవమానం ఏంటంటే.. చంద్రబాబుపై చెప్పులు విసిరారు.. రాళ్లను విసిరారు.. ఫస్ట్ అమరావతి నుండి బయల్దేరు అన్నారు.                            

 

గో బ్యాక్ చంద్రబాబు అంటున్నారు. ఘోరంగా అవమానిస్తున్నారు. ఎందుకు ఇంత మమ్మల్ని నీ రాజ్యంలో చిత్రహింసలు పెట్టావ్.. అన్యాయంగా దొంగా కేసుల్లో బుక్ చేసావ్.. మా భూములను లాక్కున్నావ్. ఇవ్వము అన్నందకు కొట్టించావ్. జైల్లో పెట్టావు.. మా భూములలో ప్లాట్లు ఇస్తా అన్నావ్. కానీ ఒక్కటి చెయ్యలేదు. మమ్మల్ని అష్టకష్టాలు పెట్టావ్.                       

 

ఇప్పుడు మేము మా రాజన్న రాజ్యంలో ఎంతో ఆనందగా ఉన్నాం. నువ్వు మా అమరావతికి వచ్చి ఈ ఆనందాన్ని పాడు చెయ్యకు అంటూ మీడియా ముందు రైతు చంద్రబాబుకు సందేశం ఇచ్చాడు. కానీ వినలేదు.. దీంతో ఆగ్రహించిన రైతులు చంద్రబాబు ముఖం కూడా చూడకూడదు అని అతని కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. రాళ్ళూ విసిరారు. అయినా ఎలాంటి మార్పు లేదు.     

 

దీంతో రైతులకు కోపం కట్టలు తెంచుకుంది. దిష్టిబొమ్మను తెచ్చారు.. దానికి చంద్రబాబు పేరు పెట్టారు.. కాల్చి పడేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇలా చెప్పులు, రాళ్లు, దిష్టిబొమ్మ దహనం అవుతున్న రాజధాని రైతుల ఆందోళనలు, నిరసనల నడుమ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు తాఫీగా రాజధానిలో పర్యటిస్తున్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: