చంద్రబాబునాయుడుకు కావాల్సింది ఇదేనా ?  చంద్రబాబు పర్యటనలో టార్గెటో రీచయ్యారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనుకోవాలి. రాజధాని పరిధిలోని వెంకటయాపాలెం గ్రామంలో చంద్రబాబు కాన్వాయ్ పై దళిత రైతులు చెప్పులు, రాళ్ళు విసరటంతో తీవ్ర ఉద్రిక్తత మొదలైంది. అసలు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటన పెట్టుకున్న అజెండానే ఇది.

 

తాను అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పటం కూడా ఉత్త డ్రామానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన ఈ ఐదు మాసాల్లో అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పెద్దగా ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబుతో పాటు అందరికీ తెలుసు.  అయినా సరే ప్రభుత్వం మీద బురదచల్లేందుకే చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు.

 

అందుకనే ముందుజాగ్రత్తగానే టిడిపి నేతలు, కార్యకర్తలను పర్యటనలో పెద్ద ఎత్తున మోహరించారు. తన పర్యటనలో గొడవ కావాలని, అది సంచలనంగా మారాలని, జాతి, జాతీయ మీడియాలో ప్రముఖంగా కవర్ అవ్వాలన్నదే చంద్రబాబు టార్గెట్. దానివల్ల జగన్ పై బురద చల్లటమే చంద్రబాబు హిడెన్ అజెండా.

 

చంద్రబాబు పర్యన ఖరారు కాగానే రాజధాని ప్రాంతంలోని దళిత రైతులు, స్ధానికుల్లో కొందరు నిరసన మొదలుపెట్టారు. తాను పర్యటనలో ఉండగానే గొడవ జరుగుతుందని చంద్రబాబుకు బాగా తెలుసు. నిజానికి చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే. అందుకనే తాను అనుకున్నట్లుగానే పర్యటన మొదలుపెట్టారు. ఊహించినట్లుగానే గొడవ జరిగింది. ప్లాను ప్రకారమే జాతి, జాతీయ మీడియాలో ప్రచారం మొదలైంది.

 

అంటే అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అర్ధమైపోతోంది. ఎప్పుడైతే టిడిపి-దళిత రైతుల మధ్య గొడవలు మొదలై కాన్వాయ్ పై చెప్పులు, రాళ్ళ దాడి మొదలైంది వెంటనే మీడియాలో చంద్రబాబుకు అనుకూలంగా   ప్రముఖంగా ప్రసారాలు మొదలైపోయాయి. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది కాబట్టి చంద్రబాబు హ్యాపీగానే ఉంటారు. ఎటు తిరిగి మధ్యలో నలిగిపోయేది మామూలు జనమే. మొత్తం మీద చంద్రబాబు అయితే తన టార్గెట్ రీచ్ అయ్యారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: