టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనకు బయల్దేరారు. టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలతో అమరావతి పర్యటన చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో టీడీపీ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడ వరకు పూర్తయ్యాయని...  పరిశీలించడంతో అమరావతిలోని టీడీపీ నేతలు రైతులతో సమావేశం కానున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది కానీ... బాబు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. అమరావతిలో రైతులకు బాబు చేసినవన్నీ మర్చిపోయినట్టున్నారు. 

 


 రాజధాని అమరావతి నిర్మాణం అంటూ 30 వేల ఎకరాలను రైతుల నుంచి తమ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ఎన్నో హామీలు ఇచ్చారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎన్నో మాటలు చెప్పారు. కానీ చివరికి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటి మొదలయ్యాయి... చంద్రబాబు చెప్పిన మాటలు అన్ని బూటకపు మాటలు అయ్యాయి. దీంతో అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరూ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజా చంద్రబాబు పర్యటనపై  రైతుల దగ్గర నుంచి చంద్రబాబుకు తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

 


 అయినప్పటికీ సరికొత్త వ్యూహం తో చంద్రబాబు అమరావతి లో పర్యటించి... రాజధాని మార్పు అంటూ జగన్ ప్రభుత్వం చెబుతుందని రైతులను తన మాస్టర్ మైండ్ వ్యూహంతో నమ్మించి... అమరావతిలోని రైతులందరికీ తన వైపు తిప్పుకోవాలని సరికొత్త వ్యూహం తో అమరావతి టూర్ కి  బయలుదేరిన చంద్రబాబుకు  అడుగడుగున చీత్కారాలు ఎదురయ్యాయి. చంద్రబాబు పర్యటన ప్రారంభం కాకముందే మొదట్లోనే చెప్పులు కర్రలతో విరుచుకు పడ్డారు అమరావతి రైతులు. అమరావతి నిర్మాణం కోసం రైతుల దగ్గర భూములు తీసుకుని  బూటకపు హామీలు ఇచ్చి మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అమరావతి పర్యటనకు వస్తున్నారు చంద్రబాబు గారు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కాకా అమరావతి పర్యటనలో చంద్రబాబుకు అమరావతి రైతుల నుండి  నిరసన జ్వాలలు తగులుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: