ఇంద్ర సినిమా గుర్తింది కదా.. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కాశీ నుంచి రాయలసీమ వచ్చిన తరువాత హెలికాఫ్టర్ నుంచి కిందకు దిగగానే భూమిని ముద్దాడుతాడు.  ఆ సీన్ సినిమాకు హైలైట్ అయ్యింది.  రాననుకున్నారా రాలేననుకున్నాడా అనే డైలాగ్స్ సినిమాలో హైలైట్ గా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం మెగాస్టార్ చాలా కష్టపడ్డారు.  సినిమా మంచి విజయం సాధించింది.  అప్పట్లో ఇంద్ర సినిమా ఎన్నో రికార్డులు సాధించింది.  
ఇక ఇదిలా ఉంటె, చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ సీన్ ను అమరావతిలో రిపీట్ చేశారు.  రాజధాని అమరావతిలోని ఉద్దండరాయుడి పాలెంలో గతంలో అమరావతికి శంకుస్థాపన, భూమిపూజ జరిగాయి.  ఆ భూమి పూజను మోడీ చేశారు.  ప్రధాని హోదాలో అప్పట్లో మోడీ భూమి పూజ చేసిన తరువాత రాజధాని ఏర్పాట్లు మొదలయ్యాయి.  అయితే, మొదట్లో చెప్పినంత స్పీడ్ గా పనులు జరగలేదు.  
సరైన డిజైన్ రెడీ కాకాపోవడంతో ఆలస్యం అయ్యింది.  కానీ, కొన్ని నిర్మాణాలను నిర్మించిన సంగతి తెలిసిందే.  అధికారం మారిపోవడంతో అమరావతిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.  అమరావతి నిర్మాణం ఆగిపోయింది. రాజధానిని అక్కడి నుంచి వేరే చోటికి మారుస్తున్నారు అనే టాక్ కూడా రావడంతో ప్రజలు అయోమయంలో పడిపోయారు.  కానీ, ఆ తరువాత సీన్ మారిపోయింది.  అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం మ్యాప్ రిలీజ్ చేసిన తరువాత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.  
అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రభుత్వం చెప్తున్నది.  పైగా ఆ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తాయని, నేల కూడా గట్టిగ లేదని అంటోంది. అయితే, ప్రపంచంలోని చాలా నగరాలను సముద్రం ఒడ్డునే నిర్మించారు.  ఈ విషయం అందరికి తెలిసిందే.  సముద్రం ఒడ్డున నిర్మించిన నగరాలు పర్యాటకంగా మంచి పేరు తెచ్చుకున్నాయి. మరి వైకాపా ప్రభుత్వం దానిని ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్ధం కానీ విషయం.  మొత్తానికైతే బాబు ఈరోజు చేసిన హడావుడి కారణంగా అమరావతి పేరు మరోసారి జాతీయ మీడియాలో హైలైట్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: