ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల మీద నవంబర్ నెలకు గాను ఆఫర్లును ప్రకటించింది. మారుతి సియాజ్, ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు బాలెనో మోడళ్ల మీద ఇది వరకు లభించే ఆఫర్లను మరింత కాలం పొడగించింది.మారుతి సుజుకి సియాజ్ కారును 2014లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు.పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే సియాజ్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్ల మీద డిస్కౌంట్లు, ఇతర లాభాల రూపంలో రూ. 70,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది, అలాగే అన్ని టాప్ ఎండ్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 60,000 వరకు లాభాలు ఉన్నాయి. సియాజ్ ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 60,000 ఆఫర్లు ఉన్నాయి. సియాజ్ పవర్‌ఫుల్ 1.5-లీటర్ డీజల్ వేరియంట్ల మీద ఏకంగా రూ. 70,000 లాభాలున్నాయి, సియాజ్ 1.3-లీటర్ వేరియంట్ల మీద అయితే అత్యధికంగా 1 లక్ష రూపాయల విలువైన ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. 

 

మారుతి ఇగ్నిస్ ఏడు విభిన్నమైన వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్స్ ,అన్ని వేరియంట్లు ఒకే పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తున్నాయి.మారుతి ఇగ్నిస్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

 

మారుతి బాలెనో కంపెనీ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ప్రస్తుతం ఇది మారుతి నెక్సా విక్రయ కేంద్రాలలో మాత్రమే ప్రత్యేకంగా లభ్యమవుతోంది. మారుతి బాలెనో 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది.  అన్ని వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, బాలెనో ఆల్ఫా వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తోంది.మారుతి సుజుకి బిఎస్-6 ప్రమాణాలను పాటించే బాలెనో వేరియంట్ల మీద రూ. 40,000 వరకు, బిఎస్-5 ప్రమాణాలను పాటించే వేరియంట్ల మీద రూ. 55,000, అన్ని డీజల్ వేరియంట్ల మీద రూ. 50,000, బాలెనో ఆర్ఎస్ వేరియంట్ల మీద రూ. 75,000 వరకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.


మారుతి సుజుకి ప్రకటించిన ఆఫర్లు, డిస్కౌంట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా బిఎస్-4 స్టాకును అమ్మేయాలనే లక్ష్యంగా పండుగ నేపథ్యంలో ప్రకటించిన ఆఫర్లను మళ్లీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా అన్ని బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద 50 రూపాయల నుండి ఏకంగా లక్ష రూపాయల వరకు అద్భుతమైన డిస్కౌంట్లతో పాటు ఐదేళ్ల పాటు వారంటీని పూర్తి ఉచితంగా అందిస్తోంది. పూర్తి వివరాలకు సమీపంలోని మారుతి అధీకృత డీలర్‌ను సంప్రదించిండి.

మరింత సమాచారం తెలుసుకోండి: