డ్రామాలాడటం అందులోను జనాల ముందు బాగా రక్తి కట్టించటం అందరికీ సాధ్యం కాదు. తాజగా చంద్రబాబునాయుడు చేసిన డ్రామాపైనే అందరిలోను చర్చ మొదలైంది. గురువారం మధ్యాహ్నం ఉద్రిక్తతలనడుమ ఉద్దండరాయుని పాలెంలో అప్పుడెప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడి రాజధాని నిర్మాణానికి  శంకుస్ధాపన చేసిన ప్రాంతంలో మట్టికి చంద్రబాబు  నమస్కారం చేయటం విచిత్రంగా ఉంది.

 

ఐదేళ్ళ పాలనలో అమరావతి నిర్మాణానికి తూట్టు పొడిచిందే చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితేంటి ? మనకు ఏస్ధాయి రాజధాని అయితే సరిపోతుంది ? అన్న సోయి కూడా లేకుండా అడ్డదిడ్డంగా దోచుకునేందుకు వేసిన ప్లాన్లో భాగంగా అంతర్జాతీయ స్ధాయి రాజధాని నిర్మాణ నినాదం. ఒక్క శాస్వత భవన నిర్మాణానికి కూడా ఎక్కడ ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు. పైగా సింగపూర్ కంపెనీలకు  కన్సెల్టెన్సీ ఫీజులని, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ కు ఫీజులని సుమారు రూ. 280 కోట్లు తగలేశాడు.

 

రైతుల నుండి భూములు తీసుకుని వాళ్ళని దెబ్బకొట్టాడు. భూములివ్వని రైతుల పంటలను తగలబెట్టించి వాళ్ళనీ దెబ్బతీశాడు. మొత్తం మీద తన ఐదేళ్ళ పాలనలో తాత్కాలిక, నాసిరకం నిర్మాణాల కోసమని వేల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని తగలేశాడు. గ్రాఫిక్స్ లో అమరావతి నిర్మాణాలను చూపిస్తే పిచ్చి  జనాలు నమ్మేస్తాడని భ్రమపడ్డాడు. సరే కారణమేదైనా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు గూబగుయ్యిమనిపించారు జనాలు.

 

ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి అమరావతి స్పూర్తిని చంపేశాడని, రూ. 2 లక్షల కోట్ల సంపదన నాశనం చేశాడన్నారు.  ప్రపంచం ముందు అమరావతి ప్రతిష్టను దిగజార్చేశాడని నోటికొచ్చినట్లు యాగీ చేస్తున్నాడు. లేని అమరావతి గురించే చంద్రబాబు ఇంత గోల చేస్తున్నాడు.

ఇది చాలదన్నట్లుగా అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఉద్ధండరాయునిపాలెంలో చంద్రబాబు భూమికి నమస్కారం చేయటమే విచిత్రంగా ఉంది. అప్పుడెప్పుడో మోడితో రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన చోట మట్టికి నమస్కారం చేయటం డ్రామా కాకపోతే మరేమిటి ? ఇంకెంత కాలం ఈ డ్రామాలను భరించాలో ఏమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: