ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న ఆదిలోనే ఆస‌క్తిని రేకెత్తించింది. ఆయ‌న అడుగు పెడు తూనే ఇక్క‌డ మ‌ట్టికి సాష్టాంగ న‌మ‌స్కారం చేసేశారు. 2017లో ఇక్క‌డ రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌దాని న‌రేంద్ర మోడీనిస్వ‌యంగా ఆహ్వానించి శంకు స్థాప‌న చేసిన చంద్ర‌బాబు.. ప‌విత్ర న‌దుల నుంచి నీటిని, ప‌విత్ర స్థ‌లాల నుంచి మట్టిని తీసుకువ‌చ్చి కుప్ప‌గా పోశారు. దీనికి అప్ప‌ట్లో కాప‌లా కూడా పెట్టారు. ఇప్పుడు అదే ప‌విత్ర మ‌ట్టికి బాబుగారు పొర్లు ద‌ణ్ణం పెట్ట‌డం ఆస‌క్తిగా మారింది. నిజానికి అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌లో బాబు ఆశించింది.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేదు.. తాను మ‌ళ్లీ సీఎం అయి ఉంటే.. ఇవి ఇలా ఉండేవా? అని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డ‌మే!

 

అయితే, రాజదానికి శంకు స్తాప‌న చేసిన త‌ర్వాత మూడేళ్ల‌పాటు చంద్ర‌బాబు అధికారంలో ఉన్నార‌నే విష యాన్ని ఎవ‌రూ ఎవ‌రికీ గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి ఆ మూడేళ్ల కాలంలో చంద్ర‌బాబు ఏం చేశా రు? ఒక్క‌టంటే ఒక్క ప‌ర్మినెంట్ భ‌వ‌నాన్ని క‌ట్ట‌గ‌లిగారా? అంటే ప్ర‌శ్న‌తప్ప స‌మాధానం లేదు. మ‌రి ఇప్ప‌టి కిప్పుడు ఐదు మాసాలు కూడా పూర్తి చేసుకోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌రుగులు పెట్టి.. ప‌ర్మినెంట్ భ‌వ‌నాలు క‌ట్ట లేదు. రాజ‌ధానిని చంపేస్తున్నారు.. అని ఆక్రోశించ‌డం వెనుక రాజ‌కీయ ప‌తంగాన్ని ఎగుర వేయ‌డ‌మే త‌ప్ప‌.. రాటు దేలిన నిబద్ధ‌త ఎక్క‌డుంది? అనుభ‌వంలో దిట్ట‌గా పేరున్న చంద్ర‌బాబు ఆమాత్రం అర్ధం చేసుకోక‌పోవ‌డం వెనుక రాజకీయ లంప‌ట‌మే క‌నిపిస్తోంది.

 

పేరుకు 33 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించామ‌న్న పేరే కానీ, ఇక్క‌డ 33 గ‌జాల్లో ప‌ర్మినెంట్‌గా క‌ట్టిన క‌ట్ట‌డం ఒక్క‌టీ లేక పోవ‌డం బాబు ద‌క్ష‌త‌లో మైన‌స్ అని పించుకోదా? అనుకూల మీడియా లో ప్ర‌చారానికి ఇచ్చిన ప్రాధాన్యం .. ఇక్క‌డ క‌నీసం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ఇప్పుడు మ‌ళ్లీ నాలుగేళ్లు గ‌డిచాక కూడా మ‌ట్టికి ద‌ణ్ణాలు పెట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. తానే ప్ర‌వ‌చించిన‌ట్టు.. అంత‌ర్జాతీయ న‌గ‌రాలు ఏమ‌య్యాయి?  న‌వ న‌గ‌రాలు.. మ‌ట్టిలో క‌లిశాయా?  స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుదే. ఇక్క‌డ అభివృద్ధి అంటే.. భూముల స‌మీక‌ర‌ణ‌తో అయినట్టేనా?  పెట్టుబ‌డులు అంటే.. అంత‌ర్జాతీయ స‌మాజానికి గంత‌లు క‌ట్ట‌డ‌మా?

 

నాడు కాక‌పోయినా.. ఏదో ఒక నాడు ఇక్క‌డి ప‌రిస్థితులు అంత‌ర్జాతీయ స‌మాజం గుర్తించ‌దా? ఈ విష‌యా న్ని తెలుసుకోలేని అల్ప జ్ఞానంలో చంద్ర‌బాబు ఉన్నార‌ని అనుకోలేం. ఇప్పుడు ఆయ‌న పొర్లు ద‌ణ్ణాలు పెట్టి ఉన్న పేరును పాడు చేసుకోవ‌డం మిన‌హా చేసేది ఏంలేదు. కేంద్రంలో ఢీ అన్నారు. దీనికి కొన‌సాగిం చలేక పోయారు. మోడీతో సై అన్నారు. ఇప్పుడు చేతులు క‌లిపితే చాల‌ని త‌ల్ల‌డిల్లుతున్నారు. నిబ‌ద్ధ‌త కొర‌వ‌డిన ప్ర‌య‌త్నంలో ఫ‌లితాలు ఆశించ‌డం బాబు చేసిన స్వ‌యంకృత‌మే అవుతుంది త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌ద‌నే విష‌యం అమ‌రావ‌తి అనే తెల్ల‌పేప‌ర్‌పై ప‌చ్చ‌గీత‌లు స్ప‌ష్టం చేయ‌డం లేదా? ఇప్ప‌టికైనా నిజ‌మైన నాయ‌కుడిగా, నిజ‌మైన ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శించి రాజ‌ధానికి స‌హ‌క‌రిస్తే.. పార్టీల‌తో ప‌నిలేని పుచ్చ‌ప‌ల్లి సుంద‌రయ్య మాదిరిగానో.. నెహ్రూ మాదిరిగానో.. మ‌రో ప‌టేల్ మాదిరిగానో ఏపీ చ‌రిత్ర‌లో బాబు నిలిచిపోతారు. లేకుండా ఓ అధ్యాయంగా మిగిలిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: