ప్రతిపక్షం అనేది లేకుండా అందరిని తన పార్టీలోకి లాక్కుని తిరుగులేని నేతగా కెసిఆర్ ఎదిగారు . కానీ ఇప్పుడు తన పార్టీలోనే ఆధిపత్య పోరుతో మరోసారి గులాబీ పార్టీలో పంచాయతీ మొదలైంది అని తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు రాజకీయం పరిస్థితులు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి. మంత్రిగా ఉంటూ ఇన్ని రోజులు నల్గొండ ఉమ్మడి జిల్లాలో జగదీశ్ రెడ్డిది ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగించారు. ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నల్గొండ పాలిటిక్స్ లో ఎంటర్ కావడంతో గులాబీల్లో గొడవలు మొదలు అయ్యాయని తెలుస్తుంది. 

 

రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పాలిటిక్స్ లో దూరంగా ఉంటారని భావిస్తే ఆయన ప్రత్యర్థులు మాత్రం పర్యటనల మీద పర్యటనలు సాగిస్తూ మంత్రి జగదీశ్ రెడ్డికి చెక్ పెడుతున్నారని వార్తలు గట్టిగ వినపడుతున్నాయి.గుత్తాకు కీలకమైన మండలి చైర్మన్ పదవి వచ్చినప్పటి నుంచి మంత్రి జగదీశ్ రెడ్డికి ఆయనకు మధ్య మనస్పర్థలు వస్తున్నాయి అని చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. అయితే ఇద్దరు నేతలు పైకి కలిసే ఉన్నాం అని చెప్తూ వస్తున్నారు.

 

వారంలో 5 రోజుల పాటు గుత్తా నల్గొండ జిల్లాలోనే ఉండడం.. ప్రజల మధ్య పర్యటిస్తూ  ఉండడంతో మంత్రి వైపు వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. సొంత కేడర్ ను కాపాడుకొని వచ్చే సారి కూడా మంత్రి పదవి కొట్టడానికే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలా నల్గొండలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడనే అనుమానాలు మంత్రి జగదీశ్ రెడ్డి వర్గంలో కలకలం సృష్టిస్తున్నాయి అట . ఈ విషయాలు అని కూడా మంత్రి జగదీశ్ రెడ్డి వర్గానికి నచ్చడం లేదు.

 

గుత్తా కు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చి అది నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం గుత్తా పర్యటనలు మంత్రి జగదీష్ వర్గానికి ఆందోళన కలిగిస్తున్నాయట.. ఇద్దరు నేతల పోటాపోటీ పాలిటిక్స్ తో నల్గొండ రాజకీయాలు హీటెక్కాయని ఖాయం అని సమాచారం. చూడాలి మరి కేసీఆర్ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: