హిస్టరీ రిపీట్స్ అనేది చాలా సహజం. ఇపుడిదే చంద్రబాబునాయుడు విషయంలో నిరూపితమైంది. ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ అప్పట్లో అంటే 1995లో ఎన్టీయార్ ను పదవిలో నుండి దింపేసిన సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఓ హోటల్ ముందుకు వచ్చి ఓపెన్ టాప్ జీపులో మాట్లాడుతున్న దివంగత నేత ఎన్టీయార్ పై చెప్పులు పడ్డాయి.  చంద్రబాబే ఆ పని చేయించారని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

 

మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు అదే చంద్రబాబుపై మామూలు జనాలు చెప్పులు విసిరారు. అప్పట్లో ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని చంద్రబాబు లాక్కున్న నేపధ్యంలో ఆ సంఘటన జరిగింది. ఇపుడు అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తమను చంద్రబాబు మోసం చేశాడంటూ దళితరైతులు చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులిసిరారు.

 

మొత్తానికి పిల్లనిచ్చిన మామగారికి అప్పట్లో చంద్రబాబు ఎటువంటి సత్కారం చేయించాడో ఇపుడు అటువంటి సత్కారాన్నే చంద్రబాబు కూడా అందుకోవాల్సొచ్చింది. నిజానికి అమరావతి నిర్మాణానికైనా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను మోసం చేసింది చంద్రబాబే. అందరినీ మోసం చేసి జనాలకు ఐదేళ్ళ పాటు గ్రాఫిక్స్ చూపిస్తు మోసం చేసిన చంద్రబాబు ఇపుడు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

 

ఐదునెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతి స్పూర్తిని చంపేశాడని, రూ. 2 లక్షల కోట్ల సంపదను తాను సృష్టిస్తే దాన్ని నాశనం చేసేశాడని జగన్ పై ఒకటే గోల చేస్తున్నారు. భూములిచ్చిన రైతులనూ మోసం చేశాడు చంద్రబాబు. రైతు కూలీల ఉపాధినీ దెబ్బకొట్టాడు.

 

ఇలా అన్ని విధాలుగా అందరినీ మోసం చేసిన చంద్రబాబు తగుదునమ్మా అంటూ జగన్ పై బురద చల్లటానికి అమరావతి ప్రాంతంలో పర్యటన పెట్టుకున్నాడు. అందుకనే  మండిపోయిన దళిత రైతులు చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, వాళ్ళు విసిరి నిరసన తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలాపేసి నిజమైన ప్రతిపక్షంగా పద్దతిగా వ్యవహరిస్తే బాగుంటుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: