వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. వరంగల్ హంటల్ రోడ్డులో యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. పుట్టినరోజు కావడంతో మానస భద్రకాళీ గుడికి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ రాత్రైనా ఆ యువతి ఇంటికి తిరిగి రాలేదు. గుడికి వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో మానస తల్లిదండ్రులు సుబేదారీ పోలీస్ స్టేషన్ లో మానస కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. 
 
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న తరువాత దర్యాప్తు చేపట్టిన పోలీసులకు రాత్రి 11 గంటల సమయంలో యువతి మృతదేహం లభ్యమైంది. పుట్టినరోజునే కూతురు విగతజీవిగా మారటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మానస మృతదేహాన్ని పోలీసులు వరంగల్ మార్చురీకి తరలించారు. పోలీసులు అత్యాచారం చేసి హత్య చేశారని ప్రాథమికంగా అంచనా వేశారు. 
 
పోలీసులు మానస కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సాయి గౌడ్ ను  అరెస్ట్ చేశారు. సాయి, సాయి స్నేహితులను పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. పుట్టినరోజు నాడే మానసపై అత్యాచారం, హత్య జరగటం కుటుంబసభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. వైద్యుల నివేదిక తరువాత ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. 
 
పోలీసులు ఈ ఘటనలో యువతి మర్మాంగం నుండి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సహాయంతో నిందితులను గుర్తించారని సమాచారం. సాయి గౌడ్ ను పోలీసులు విచారించిన తరువాత ఈ ఘటనలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యువతి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఘటనా స్థలానికి కొంత దూరంలో యువతి చెప్పులు, బీరు సీసాలు పోలీసులకు లభించాయి. పోలీసులు యువతి స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: