ఎన్నో ట్విస్టులు ఎన్నో రాజకీయ  సమీకరణాల మధ్య చివరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే తో పాటు 10మంది  మంత్రి పదవులకు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసేందుకు అంతా సిద్ధం అయిపోయింది. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అప్పటినుంచి శివసేన అధినేత ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని  పట్టుబట్టిన శివసేన పంతాన్ని నెగ్గించుకుంది. మొదట అజిత్ పవార్ మద్దతుతో బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత సంఖ్యా బలం నిరూపించుకోలేక  బిజెపి పార్టీ ప్రభుత్వం  కుప్పకూలిపోయింది. 

 


 దీంతో శివసేన పార్టీ కాంగ్రెస్ ఎన్సిపి పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఇంకొద్ది గంటల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎవరితోనూ మాట్లాడకుండా తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు . దీంతో అజిత్ పవార్ తో  పార్టీ నేతలు  మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్సీపీ నుంచి గెలిచిన అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపడంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బలనిరూపణ చేయలేక దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

 


 అయితే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా  కాంగ్రెస్ ఎన్సిపి పార్టీలకు చెరో  ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినుంది శివసేన. అయితే  ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కు  ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతుందని  ప్రచారం జరుగుతోంది. అయితే అజిత్ పవార్  ఫోన్ స్విచాఫ్ చేసుకోవడంతో  ఎన్సీపీ  నేతలను  ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అజిత్ పవర్ ఫోన్ స్విచాఫ్ రావడం పై స్పందించిన ఎన్సీపీ వర్గాలు ... అజిత్ పవార్ కు పదే పదే ఫోన్ చేస్తుండడంతోనే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిపారు . ఈరోజు సాయంత్రం జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అజిత పవార్ పాల్గొంటారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మహా రాష్ట్ర రాజకీయాల్లో చివరి నిమిషంలో సరికొత్త ట్విస్ట్ లు తెరమీదకి వచ్చే రాజకీయ సమీకరణాల తారుమారు చేసిన  నేపథ్యంలో ఇంకేమైనా ట్విస్ట్ లు తెరమీదకి  వస్తాయా అని ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: