రామ్‌గోపాల్‌ వర్మ వివాదాస్పద చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌ పై రాని కథాంశం. ఒకవేళ ఎవరన్న తీయాలన్న బహుశ ఆర్జీవి అంత సాహసించకపోయేవారేమో..!!! నిజజీవిత వ్యక్తుల్ని, సంఘటనల్ని అసరాగా చేసుకొని కల్పిత కథాంశంతో ఇప్పటివరకు ఎవరూ సినిమా చేయలేదని, లక్కీగా ఆ ఆలోచన నాకు వచ్చిందని చెప్పుకొచ్చాడు వర్మ. విజయవాడలో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ప్రాంతంపై మరో వర్గం వారు ఎలా ఆధిపత్యం చెలాయించారన్నదే ఈ చిత్రం యొక్క వృత్తాంతం. 


జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి వాతావరణం చూశాక నాకు ఈ కథ ఐడియా వచ్చింది. ఒక వర్గంవారు మరో వర్గం ఉన్న ప్రాంతానికి రావడం అన్నది నన్ను ఇన్‌స్పైర్‌ చేసిన అంశం. మే 2019 నుండి సెప్టెంబర్‌ 2020 మధ్య జరిగే ఘటనల ఆధారంగా తీసిన పొలిటికల్‌ సెటైరికల్‌ సినిమా అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ఊహించి ఈ సినిమా తీశానాని అన్నారు. సినిమా మొత్తం వినోదాత్మకంగా ఉంటుంది. రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ను తీసుకొని ఫిక్షనల్‌ స్టోరీ చెయ్యడం నాకు తెలిసి ఇండియన్‌ స్క్రీన్ పై ఎప్పుడూ జరగలేదు. ఈ సినిమానే మొదటిది అనుకుంటా. టైటిల్‌ను బట్టి ఓ కులాన్ని తక్కువ చేసి చూపించానని అనుకుంటున్నారు.
 


ఆర్జీవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ఏ కులాన్ని, ఏ వర్గాన్ని కించపరచలేదు. ఎవరిని కూడా గొప్పగా చూపించే సన్నివేశాలు ఇందులో కనిపించవని అన్నారు. ఇలాంటి సినిమాలు చేయడం వల్ల వృత్తిపరమైన సంతృప్తి కంటే వ్యక్తిగత సంతృప్తి ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు గిల్లడం అలవాటు. ఫిల్మ్‌ మేకర్‌గా నేను సొంతంగా ఫీల్‌ అయిన ఎగ్జైట్‌మెంట్‌నే సినిమాగా చెప్పాలనుకుంటా. నేను తీసే రియలిస్టిక్‌ డ్రామాలకు ఇమేజ్‌ ఉన్న హీరోలు సూట్‌కారు. అందుకే కొత్తవాళ్లతో తీస్తా’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. 


ఆయన దర్శకత్వం వహించిన ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వర్మ బుధవారం విలేకర్లతో మాట్లాడారు.ఏ నాయకుడిని, పార్టీని టార్గెట్ చేస్తూ సినిమాను రూపొందించలేదు. వాస్తవిక అంశాలతో తెరకెక్కిన రాజకీయ వ్యంగ్యాస్త్ర కథాంశమిది’. అని అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. కంపెనీ పతాకంపై ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో రామ్‌గోపాల్‌వర్మ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: