ఆర్టీసీ కార్మికులను చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఏదో సాధించాలని సమ్మె మొదలు పెడితే చివరికి ఉద్యోగాలు కూడా ఊడిపోయేలా ఉన్నాయి. ఈ సమ్మె కారణంగా సమ్మె పట్ల సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. ఒకవైపు ఈ ఆర్టీసీ కార్మికులు విధుల్లో లేరు అని.. మీరు లేకపోయినా మాకు బస్సులు నడుస్తాయి అని పంతంతో తాత్కాలిక కార్మికులను ప్రభుత్వం తీసుకుంది. 

 

అయితే ఈ తాత్కాలిక డ్రైవర్లు చక్కగా డ్యూటీ చేస్తున్నారా అంటే లేదు. ఒకడు తాగి వచ్చి బస్సు నడిపితే మరొకడు హైస్పీడ్ తో బస్సు నడుపుతున్నాడు. మరొకడు ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ బస్సు నడుపుతున్నాడు. దీనికి ఫలితంగా ఎంతోమంది అమాయక ప్రజలు యాక్సిడెంట్లకు గురై మరణిస్తున్నారు. ఇన్ని జరుగుతున్న ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ చేసిన ప్రభుత్వం ఇంకా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం లేదు. 

 

ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వద్ధామరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అందిన సమాచారం మేరకు 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెకు అశ్వత్థమ రెడ్డి నేతృత్వం వహించారు. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో మూడు రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె విరమణ జరిగింది. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ఇటు ప్రభుత్వానికి అటు కార్మికులకు మధ్యలో ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. 

 

దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి అశ్వద్ధామరెడ్డి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజీనామా చేస్తారా ? లేక ఇవి కేవలం ఊహాగానాలేనా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: