మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటన చేస్తుండడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు అమరావతిలో అడుగుపెట్టగానే కొంతమంది టిడిపి నేతలు, ఒక వర్గం రైతులు స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. అయితే అక్కడే మరొక వర్గం రైతులు నిరసన చేపట్టి.. చంద్రబాబు నాయుడు రాకకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ లో వెంకటపాలెం దగ్గరకు వెళ్లగానే... అక్కడ ఉన్న కొంతమంది రైతులు కర్రలు, చెప్పులు విసిరి 'చంద్రబాబు మీరు వెనక్కి వెళ్ళిపొండి' అంటూ నినాదాలు చేశారు. కొంతమంది ప్లకార్డులు పట్టుకొని చంద్రబాబునాయుడును వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. ఆ రైతు వర్గంని ఆపడానికి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. టిడిపి నేతలు కూడా ఎదురుదాడికి దిగుతుంటే..ఇరువురి వర్గాలను ఆపడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.


ఇక ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో... టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడి గురించి స్పందించాడు. లోకేష్ మాట్లాడుతూ... 'చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసీపీ చేసిన కుట్రల ఎక్కడ బయటపడతాయోనని.. వైఎస్ఆర్ సీపీ నేతలు కావాలనే కాన్వాయ్ పై గుండాలతో దాడి చేయించారు' అంటూ ఆరోపించాడు. మరీ ఇంత పిరికితనమా.. టీడీపీ హయాంలో తాము కూడా ఇలా చేస్తే జగన్ గారు పాదయాత్ర చేయగలిగేవారా అంటూ ప్రశ్నించారు.


వైసీపీ నేతలు కూడా టిడిపి చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు తన పార్టీ ఐదేళ్ల పాలనలో రాజధాని ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు.. అటువంటప్పుడు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో పర్యటన చేస్తున్నాడంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: