ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తదుపరి పరిస్థితులు మెరుగున పడ్డాయి. ప్రస్తుత మహరాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన చరిత్రను సృష్టించబోతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. 

 


ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఉద్ధవ్‌ ఠాక్రే శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసన సభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించబోతున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంత వరకు ఇలాంటి రికార్డు ఎప్పుడు నమోదు కాలేదు. నమోదు కావడం ఇదే మొదటి సారి. 

 


‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. బహుశా ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్‌ కల్సే తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై లోని వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్‌ ఠాక్రే, సోదరుడు రాజ్‌ ఠాక్రే ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్‌ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. 

 


ఇక, తండ్రీ కొడుకులైన కాంగ్రెస్‌ నేతలు శంకర్‌రావు చవాన్‌, అశోక్‌ చవాన్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్‌ నుంచి మహారాష్ట్రకు ఎక్కువ మంది సీఎం లు పనిచేశారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి శివసేన నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన నుంచి సీఎం అయిన మూడో నేత కానున్నారు. ఇక, ఎన్సీపీ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ సీఎం పగ్గాలు చేపట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: