వెంట‌లేట‌ర్‌పై అల్లాడుతున్న ఏపీ టీడీపీకి చంద్ర‌బాబు అమ‌రావ‌తి ర‌క్తం ఎక్కిస్తున్నారా ?  ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అనేక ఉద్య‌మాలు నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై చేసిన ఎదురు దాడి వంటివిపార్టీకి ఎక్క‌డా క‌లిసి రాలే దు. నాయ‌కులును త‌న వెనుక తిప్పలేదు. పార్టీలోనూ జోష్ రాలేదు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఇప్పు డు రాజ‌ధాని ప‌ర్య‌ట‌న అనే కొత్త అంశాన్ని అనూహ్యంగా భుజానికి ఎత్తుకోవ‌డం, దీనిని స‌క్సెస్ చేయ‌డం ద్వారా తిరిగి త‌న ఉనికిని తాను నిలబెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేశారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంది. అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ డంలో చంద్ర‌బాబు ప‌రాజ‌యం పాల‌య్యారు.

 

సాధార‌ణ‌మే గెలుపు ఓటములు అనుకున్నా.. పార్టీ ప‌రంగా చూసుకుని ఘోర‌మైన దెబ్బ త‌గిలింది. పార్టీ నుంచి కీల‌క మైన నాయ‌కులు బు ట్టా త‌ట్టా స‌ర్దేశారు. సరే.. ఓడిపోయిన పార్టీలో ఎవ‌రు మాత్రం ఉంటారు? గ‌తంలో వైసీపీలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించ‌లేదా? అనే ప్ర‌శ్న‌లు స‌మాధానం అనుకొని స‌రిపెట్టేసుకున్నా .. అత్యంత కీల‌క‌మైన మ‌రో ప్ర‌శ్న టీడీపీని ఉరికంభం ఎక్కించేసింది. అదే.. చంద్ర‌బాబు రాజ‌కీయ ద‌క్ష‌త !! ``ఇక‌, బాబు ప‌ని అయిపోయింది!.. చిన్న‌బాబుకు ప‌నిచేత‌కాదు.. పార్టీని మూసేయ‌డ‌మో.. విలీనం చేసే య‌డ‌మో.. మాత్ర‌మే మిగిలింది!``- ఇదీ టీడీపీ గురించి ఏ ఇద్ద‌రు మాట్లాడుకున్నా వినిపించిన విష‌యాలు. దీంతో ఒక్క‌సారిగా తెలుగు వారి ఆత్మ గౌర‌వం స్థానంలో చంద్ర‌బాబు ఆత్మ గౌర‌వం ఉలిక్కి ప‌డింది.

 

చిన్న‌బాబు స్థానంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్థావ‌న బీపీని మ‌రింత పెంచేసింది. ఈ నేప‌థ్యంలో పార్టీని బ్ర‌తికించుకునేందుకు బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డం ప్రారంబించారు. నాయ‌కుల‌ను బ్ర‌తిమాల‌డం క‌న్నా.. పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో తానే రంగంలోకి దిగి.. వివిధ రూపాల్లో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం బెట‌ర‌ని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టి బొడ్డూడ‌ని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల అస్త్రాలు, నిర‌స‌న శ‌రాల‌ను ప్ర‌యోగించారు. టీడీపీ త‌మ్ముళ్ల‌పై దాడి అంటూ యాగీ చేశారు. కేంద్రంలో ఎక్క‌డో ఉన్న మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఏపీకి తీసుకువ‌చ్చారు. అయితే, ఆ హ‌క్కుల సంఘం బిక్క‌మొహం వేసింది. వాస్త‌వాలు తెలుసుకుని మౌనంగా నిష్క్ర‌మించింది.

 

ఇక‌, ఇసుక పై దీక్ష‌లు, స‌త్యాగ్ర‌హాలు చేశారు., వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఇసుక దొర‌క‌ద‌ని తెలిసి కూడా సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు యాగీ చేయ‌డాన్ని ప్ర‌జ‌లే త‌ప్పుప‌ట్టినా.. ఆయ‌న పార్టీ కోసం తుడిచేసుకున్నారు. ఇది స‌క్సెస్ అయి టీడీపీ రేటింగ్ పెరిగితే.. పోయినవాళ్లు రాక‌పోయినా.. ఉన్న‌వారు పోకుండా ఉంటార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, రెంటికీ చెడ్డ రేవ‌డిలా .. ఈయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు నిలిచిపోయాయి. పార్టీలో దీనిపై మిశ్ర‌మ స్పంద‌న కూడా క‌నిపించ‌క‌పోగా.. పార్టీలోని సొంత ఎంపీలే జ‌గ‌న్‌ను  పొగిడే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఆఖ‌రి అవ‌కాశం గా చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ఎంచుకున్నారు. ఇక్క‌డ ప‌ర్య‌టించి జ‌గ‌న్‌పై బెడ్డ‌లు వేస్తే.. టీడీపీపై నాయ‌కులు పూల‌వ‌ర్షం కురిపిస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది కూడా ఆశించినంత స‌క్సెస్ అయిన‌ట్టు క‌న‌ప‌డడం లేదు. మ‌రి బాబు మ‌ళ్లీ ఎలాంటి ప్ర‌య‌త్నం చేస్తారో ?  చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: