రంగారెడ్డి జిల్లాలోని షాద్‌న‌గ‌ర్లో దారుణం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఓ యువ‌తిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఎవ‌రో పెట్రోల్ పోసి దారుణంగా త‌గ‌ల‌బెట్టారు. చివ‌ర‌కు ఆమె వెట‌ర్నరీ డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం ప్రియాంక రెడ్డి స్కూటీ పాడైపోయింద‌ని త‌న త‌ల్లిదండ్రుల‌కు కాల్ చేసింది. అంత‌కు ముందు ఆమె చికిత్స కోసం మాదాపూర్‌లోని ఓ హాస్ప‌ట‌ల్‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం.

 

స్కూటీ పాడైంద‌ని త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసిన కొద్ది సేప‌టికే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. 
ప్రియాంక మృత‌దేహాన్ని షాద్ నగర్ చటాన్ పల్లి శివారులో అండర్ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. నవబ్ పేట్ మండల్ కొల్లూర్ గ్రామంలో వెటర్నరి డాక్టర్ గా ఆమె విధులు నిర్వహిస్తుంది. ఇక స్కూటీ పాడైపోయిన‌ప్పుడు ఆమె త‌న సోద‌రితో కూడా ప్రియాంక ఫోన్లో మాట్లాడారు.

 

సోద‌రితో ఫోన్లో మాట్లాడిన‌ప్పుడు త‌న చుట్టూ లారీ డ్రైవ‌ర్లు ఉన్నార‌ని.. అంతా భ‌యంగా ఉంద‌ని కూడా ఏడుస్తూ చెప్పింది. ఇక ఈ మృతిలో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు కూడా లేవు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గరికి ప్రియాంక వెళ్లిన‌ట్టు తెలిసింది. అయితే అక్క‌డ స్కూటీ పెట్టి ఆమె గ‌చ్చిబౌలీకి క్యాబ్‌లో వెళ్లిన‌ట్టు స‌మ‌చారం. తిరిగి ఆమె రాత్రి 9.15 గంటలకు శంషాబాద్ టోల్ ప్లాజా వద్దకు ప్రియాంకారెడ్డి వ‌చ్చింద‌ని అంటున్నారు.

 

ఆమె స్కూటీకి కావాల‌నే ఎవ‌రైనా పంక్చ‌ర్ చేశారా ?  ఆ స్కూటీకి పంక్చర్ చేసిన ఆ వ్యక్తి ఎవరు..? మ‌రి ప్రియాంక ఫోన్లో త‌న‌కు ఓ వ్య‌క్తి సాయం చేస్తాన‌ని వ‌చ్చిన‌ట్టు చెప్పింది... సాయం చేస్తానని వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ? పంక్చర్ చేయించిన తర్వాత ప్రియాంక ఎవరి వాహనంపై వెళ్లింది ?  మ‌రి ఆమె మృత‌దేహం ఉన్న స్పాట్‌లో స్కూటీ ఎందుకు లేదు ?  ప్రియాంకను చంపింది లారీ డ్రైవర్లా..? తెలిసిన వ్యక్తులా...?
భయంగా ఉంటే ప్రియాంక టోల్ ప్లాజా వద్దకు ఎందుకు వెళ్లలేదు..?  ఆమె సోద‌రి అక్క‌డ‌కు వెళ్లాల‌ని కూడా చెప్పింది క‌దా.. !  ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు లేవు. ప్ర‌స్తుతం పోలీసులు కూడా ఈ కోణంలో విచార‌ణ చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: