రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యువ‌తుల‌పై అత్యాచారాలు, లైంగీక వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మ‌హిళ‌లు, యువ‌త‌ల‌పై అత్యాచారాలు, లైంగీక దాడులు ఆరిక‌ట్టేందుకు ఎన్ని కొత్త చ‌ట్టాలు వ‌స్తున్నా ఈ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా హైద‌రాబాద్‌లో వెట‌ర్నరీ డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డిని ఏకంగా అత్యాచారం చేసి మ‌రీ త‌గ‌ల‌బెట్ట‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఈ సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని తీవ్రంగా క‌లిచి వేసింది.

 

అస‌లు ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌తి ఒక్క యువ‌తి, మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అయితే ఇప్పుడు ప్ర‌మాదంలో ఉన్న మహిళ‌లు, యువ‌తులు హెల్ప్‌ లైన్లకు కాల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డం ద్వారా వాళ్ల‌కు వాళ్లే కాపాడుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇది చాలా మందికి తెలియ‌దు. యువ‌తులు, మ‌హిళలు ఎవ‌రైనా అనుకోని ప్ర‌మాదంలో ఇరుక్కుంటే వాళ్లు ముందు అధైర్య ప‌డాల్సిన ప‌రిస్థితి లేదు. ముందు ధైర్యంగా ఆలోచించాలి. 

 

ఆ వెంట‌నే ప్రమాదంలో ఉన్న బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్‌ లైన్‌ నెంబర్లను తమ సమాచారాన్ని అందించాలి. ఈ నెంబ‌ర్ల‌ను త‌మ మొబైల్ ఫోన్ల‌ను నిక్షిప్తం చేసుకున్నా... లేదా గుర్తు పెట్టుకున్నా స‌రిపోతుంది. ఈ నెంబ‌ర్లు ఇలా ఉన్నాయి.

 

- విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 181 నెంబర్‌ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్‌ లైన్‌ నెంబరు 040 - 2785 2355 గానీ, వాట్సాప్‌ నెంబరు 94906 16555 కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

 

- దేశ వ్యాప్తంగా ఉన్న టోల్‌ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్‌ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొంద‌వ‌చ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: