ఎన్నికల్లో ఓడిపోయిన ఐదు నెలలకే చంద్రబాబునాయుడు ఇంత గోల ఎందుకు చేస్తున్నారు ? మామూలుగా అయితే ఓ ఏడాది వరకూ చంద్రబాబు కామ్ గానే ఉండొచ్చు. కానీ అలా ఉండలేకపోతున్నారు. అధికారపార్టీకి ఆరుమాసాల వ్యవధి కూడా ఇవ్వలేక చంద్రబాబు ఎందుకింత గోల చేస్తున్నారు ?

 

ఎందుకంటే వైసిపి ప్రభుత్వంలో కూడా తన మాటే చెల్లుబాటు కావాలని చంద్రబాబులో విపరీతమైన ఆలోచన మొదలైనట్లుంది. వైసిపి ప్రభుత్వంలో తన మాట ఎలా చెల్లుబాటు అవుతుందని  చంద్రబాబు అనుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లోనే తీసుకున్న కొన్ని నిర్ణయాలతో చంద్రబాబుకు మండిపోయింది.

 

విద్యుత్ రంగంలో పిపిఏలను సమీక్షించటం, పోలవరం, బందరు పోర్టు కాంట్రాక్టు నుండి నవయుగ కంపెనీని తొలగించటం, చంద్రబాబు కలలుకన్న అంతర్జాతీయ కలల రాజధాని నిర్మాణానికి పాతరేయటం లాంటి నిర్ణయాలను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే పై కంపెనీలతో చంద్రబాబుకు విడదీయరాని బంధముంది.

 

ఇవే కాకుండా జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు చంద్రబాబుకు షాకు కొట్టింది. మద్యం షాపులు తగ్గించటం, బార్ల సంఖ్యను బాగా తగ్గించేసిన విషయం కూడా నచ్చలేదు. ఎందుకంటే బార్లు, మద్యం దుకాణాలు ఎక్కువగా టిడిపి నేతల చేతుల్లోనే ఉన్నాయి. స్కూళ్ళల్లో  ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టటం కూడా చంద్రబాబుకు పెద్ద దెబ్బే.

 

ఎలాగంటే ప్రైవేటు స్కూళ్ళు ఎక్కువగా కమ్మ సామాజికవర్గమో లేకపోతే  టిడిపి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే ప్రైవేటు స్కూళ్ళలో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. జగన్ నిర్ణయంతో టిడిపి నేతలకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదాయం పడిపోతుంది.  జగన్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి అనేక  విషయాల్లో  చంద్రబాబు తన మాటే చెల్లుబాటు కావాలని అనుకున్నారు. అది కుదరకపోవటంతో నానా యాగీ మొదలుపెట్టారు.  అందుకే జగన్ పై బురద చల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: