ఆంధ్రప్రదేశ్ లో  2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మొదటి సారి టీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు  అమరావతిలో పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజధాని మొత్తం హాట్ హాట్ వాతావరణం నెలకొంది. అయితే గతంలో రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించిన చంద్రబాబు రైతులకి  ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు  చంద్రబాబు. దీంతో రాజధానిలో పర్యటించవద్దు అంటూ రైతులందరూ నల్ల బ్యాడ్జీలు ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు అమరావతి రైతులు. అంతేకాకుండా అమరావతి పర్యటన ప్రారంభంలోనే చెప్పులు కర్రలను  చంద్రబాబు కాన్వాయ్ పైకి  విసిరారు. 

 

 

 

 ఈ క్రమంలో చంద్రబాబు పర్యటన రాష్ట్రంలో దుమారం రేగుతోంది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. అయితే ఫుల్ హైటెన్షన్ మధ్య చంద్రబాబు  అమరావతి పర్యటన కొనసాగుతోంది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయని పరిశీలించిన చంద్రబాబు టీడీపీ నేతలు రైతులతో సమావేశమయ్యేందుకు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేపడుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై  దాడి ఘటనను టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి  చేసింది అమరావతి రైతులు కాదు అని  పెయిడ్ బ్యాచ్  తో వైసీపీ నేతల దాడులు చేయించారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

 

 

 

 అయితే చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు కర్రలతో రైతులు దాడికి దిగిన ఘటనపై స్పందించిన టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలైన అమరావతి ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోని షేర్ చేశారు నారా లోకేష్. వైసీపీ నేతలు మాత్రం పెయిడ్ బ్యాచ్తో దాడులు చేయించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇతర ప్రాంతాల నుంచి గుండాలను రప్పించే చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు  చేసినట్టు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: